News August 6, 2025

ఈ రోజు నమాజ్ వేళలు (ఆగస్టు 6, బుధవారం)

image

✒ ఫజర్: తెల్లవారుజామున 4.40 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 5.57 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.22 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.49 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 6.47 గంటలకు
✒ ఇష: రాత్రి 8.04 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

Similar News

News August 7, 2025

ఇవాళ 3 పథకాలు ప్రారంభం

image

AP: చేనేత కార్మికుల కోసం 3 పథకాలను ప్రభుత్వం ఇవాళ ప్రారంభించనుంది. కార్మికులకు 200 యూనిట్లు, మరమగ్గాలకు 500 యూనిట్ల ఫ్రీ కరెంట్ అందించే స్కీంను జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా మంగళగిరిలో CM చంద్రబాబు ప్రారంభిస్తారు. చేనేత దుస్తులపై 5% GST మినహాయింపు, చేనేతలకు హెల్త్ ఇన్సూరెన్స్‌పై CM ప్రకటించనున్నారు. ప్రభుత్వం సుమారు 2.5 లక్షల చేనేత కార్మికుల జీవనోపాధిని బలోపేతం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది.

News August 7, 2025

రూ.18 లక్షల జీతంతో ఉద్యోగాలు.. పెళ్లి కానివారు అర్హులు

image

ఆర్మీలో షార్ట్ సర్వీస్ కమిషన్ 379 టెక్నికల్ పోస్టులకు దరఖాస్తులు స్వీకరిస్తోంది. బీటెక్ పూర్తైన లేదా చివరి ఏడాది చదువుతున్న 20-27 ఏళ్లలోపు పెళ్లికాని వారు అర్హులు. ఎంపికైతే ట్రైనింగ్‌లో ₹56,100 స్టైఫండ్ ఉంటుంది. లెఫ్టినెంట్ హోదాతో విధుల్లోకి తీసుకుని ఏడాదికి రూ.18 లక్షలు(నెలకు ₹1.5లక్షలు) జీతం ఇస్తారు. పదేళ్లు విధుల్లో ఉండొచ్చు. అవసరమైతే పొడిగిస్తారు. లేదంటే తప్పుకోవాలి. AUG 22 చివరి తేదీ. వివరాలకు <>క్లిక్ <<>>చేయండి.

News August 7, 2025

ఎంపీ గోల్డ్ చైన్ పోతే 2 రోజుల్లో.. మరి మన పరిస్థితి?

image

తమిళనాడు ఎంపీ సుధ <<17298166>>గోల్డ్ చైన్‌<<>>ను దొంగిలించిన వారిని 2 రోజుల్లోనే పట్టుకున్న పోలీసులు.. సామాన్యుల ఫిర్యాదులపై అంత వేగంగా ఎందుకు స్పందించరని చర్చ జరుగుతోంది. 2014లో యూపీ మంత్రి అజామ్ ఖాన్ ఫామ్‌హౌస్‌లో ఏడు గేదెలు చోరీకి గురైతే 24 గంటల్లో వాటి జాడ కనుక్కున్నారని గుర్తు చేస్తున్నారు. అదే సామాన్యులు జీవితమంతా కష్టపడి సంపాదించిన సొమ్ము చోరీ అయితే పోలీసులు ఇదే విధంగా స్పందిస్తారా? COMMENT.