News August 6, 2025

భారత్‌తో సంబంధాలను దెబ్బతీయొద్దు: హేలీ

image

రష్యా నుంచి ఆయిల్ కొంటున్న భారత్‌పై టారిఫ్స్ పెంచుతామని ట్రంప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిపై ద.కరోలినా మాజీ గవర్నర్, UN మాజీ రాయబారి నిక్కీ హేలీ స్పందించారు. ‘రష్యా నుంచి INDIA ఆయిల్ కొనుగోలు చేయొద్దు. కానీ రష్యా, ఇరాన్ నుంచి అధికంగా ఆయిల్ కొంటున్న చైనాపై సుంకాలకు విరామం ఇచ్చారు. చైనాపై టారిఫ్స్‌కు విరామం ఇవ్వకండి. IND లాంటి బలమైన మిత్రదేశంతో సంబంధాన్ని దెబ్బతీయకండి’ అని సూచించారు.

Similar News

News August 6, 2025

భారత్‌కు ట్రంప్ మరో బిగ్ షాక్

image

భారత్‌పై అక్కసుతో ఉన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అదనపు టారిఫ్ వేసి మరోసారి ఉక్రోషం వెళ్లగక్కారు. 25% అదనపు టారిఫ్‌లు విధిస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే ఆయన మన దేశంపై 25% సుంకాలు మోపారు. దీనికి అదనంగా సుంకాలు ఉంటాయని ఇటీవల ప్రకటించారు. ఈక్రమంలోనే మరో 25% విధిస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై సంతకం చేశారు. రష్యా నుంచి IND ఆయిల్ కొనుగోలు చేస్తోందనే కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వైట్‌హౌస్ తెలిపింది.

News August 6, 2025

ఆటో డ్రైవర్లకు సహాయం: CBN

image

AP: ‘స్త్రీశక్తి’ పథకం అమలుకు ముందే ఆటో డ్రైవర్లతో సమావేశం కావాలని సీఎం చంద్రబాబు మంత్రులను ఆదేశించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తే వారు నష్టపోతారన్న అభిప్రాయాలపై స్పందించారు. డ్రైవర్లతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకుని, తగిన సహాయం చేయాలన్నారు. ఫ్రీ బస్సు పథకం ప్రారంభోత్సవంలో మంత్రులు అందరూ పాల్గొనాలని CM సూచించారు. కాగా AUG 15 నుంచి రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు ఫ్రీ బస్సు పథకం అమలు కానుంది.

News August 6, 2025

ఇండియన్ క్రికెట్ ఎవరి కోసం ఆగదు: గంగూలీ

image

టెస్టులు, T20Iల నుంచి రిటైరైన స్టార్ క్రికెటర్లు వన్డేల్లోనైనా కొనసాగుతారా లేదా అన్న చర్చ నేపథ్యంలో మాజీ క్రికెటర్ గంగూలీ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘భారత క్రికెట్ ఎవరి కోసం ఆగదు. గవాస్కర్ తర్వాత సచిన్ వచ్చారు. ద్రవిడ్, సెహ్వాగ్, లక్ష్మణ్ వెళ్లాక కోహ్లీ ఎమర్జ్ అయ్యారు. ఇప్పుడు జైస్వాల్, పంత్, గిల్ నిలబడ్డారు. డొమెస్టిక్ క్రికెట్, IPL రూపంలో IND క్రికెట్‌కు పటిష్ఠ వ్యవస్థ ఉంది’ అని వ్యాఖ్యానించారు.