News March 31, 2024

విశాఖ: ప్రవేశాల గడువు పొడిగింపు

image

ఉమ్మడి విశాఖ జిల్లాలోని ప్రభుత్వ గురుకుల సొసైటీకి చెందిన గురుకుల పాఠశాలల్లో అయిదో తరగతిలో ప్రవేశాల కోసం ఏప్రిల్ 5 వరకు దరఖాస్తులు చేసుకోవడానికి గడువును పొడిగించారు. రానున్న విద్యాసంవత్సరంలో భీమిలి, అచ్యుతాపురం బాలికలు, నర్సీపట్నం బాలుర గురుకుల పాఠశాలల్లో ప్రవేశాల కోసం ఏప్రిల్ 25న జిల్లా కేంద్రాల్లో ప్రవేశ పరీక్షలు జరుగుతాయని పరీక్షల ఉమ్మడి విశాఖ జిల్లా కో-ఆర్డినేటర్ రాంబాబు పేర్కొన్నారు.

Similar News

News March 18, 2026

భవానిపట్నం ప్యాసింజర్ (58504) రైలు రీ షెడ్యూలు

image

విశాఖపట్నం నుంచి బయల్దేరాల్సిన భవానిపట్నం ప్యాసింజర్ (58504) రైలు బుధవారం రీ షెడ్యూలు అయింది. విశాఖ నుంచి సాయంత్రం 6 గంటలకు బయల్దేరాల్సిన ఈ రైలు సాయంత్రం 7 గంటలకు బయలుదేరేలా మార్పు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. సాంకేతిక కారణాల నేపథ్యంలో రీ షెడ్యూలు జరిగినట్లు ప్రకటించారు. ప్రయాణికులు ఇది గమనించి సహకరించాలని కోరారు.

News March 18, 2026

విశాఖ: దివ్యాంగులకు ఉచిత బస్సు పథకం ప్రారంభం

image

దివ్యాంగుల కోసం ఏపీ ప్రభుత్వం దివ్యాంగ శక్తి పథకాన్ని అమలు చేస్తూ ఉచిత బస్సు సౌకర్యాన్ని బుధవారం ప్రారంభించింది. విశాఖలో జరిగిన కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్.మాధవ్ పాల్గొని ప్రారంభించారు. ఈ పథకం ద్వారా దివ్యాంగుల రవాణా సమస్యలు తగ్గి, సామాజిక-ఆర్థిక భాగస్వామ్యం పెరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ హరేంధిర ప్రసాద్, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

News March 18, 2026

విశాఖ: మత్స్యకారులను కాపాడిన కోస్ట్ గార్డ్స్

image

నడిసంద్రంలో చిక్కుకున్న మత్స్యకారులను ఇండియన్ కోస్టల్ గార్డ్ కాపాడింది. విశాఖకు చెందిన మత్స్యకారులు చేపల వేటకు వెళ్లారు. తీరానికి 300 కి.మీ.ల దూరలో బోటు మరమ్మతులకు గురైంది. దీంతో ప్రాణాలను అరచేతిలో పట్టుకొని కేంద్ర ప్రభుత్వం అందజేసిన ట్రాన్స్‌పాండర్ సాయంతో అధికారులను కాంటాక్ట్ అయ్యారు. కలెక్టర్ హరేంధిర ప్రసాద్ సమాచారం మేరకు కోస్ట్ గార్డులు సముద్రంలో చిక్కుకున్న వారిని కాపాడారు.