News August 6, 2025
వాట్సాప్‌లో కొత్త ఫీచర్.. అకౌంట్ లేని వారితోనూ చాట్ చేయొచ్చు!

వాట్సాప్‌లో త్వరలో ‘గెస్ట్ చాట్’ పేరిట కొత్త ఫీచర్ రానుంది. దీని సాయంతో వాట్సాప్ అకౌంట్ లేని వారితో చాట్ చేయవచ్చు. ఇందుకోసం యూజర్లు ఆ కాంటాక్ట్ నంబర్‌కు టెక్స్ట్ మెసేజ్/ఈమెయిల్/ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల ద్వారా ఇన్విటేషన్ లింక్ పంపాల్సి ఉంటుంది. అయితే ఈ చాట్ ద్వారా మీడియా ఫైల్స్ పంపేందుకు, ఆడియో/వీడియో కాల్స్ చేసేందుకు వీలుండదు. ప్రస్తుతం ఈ ఫీచర్ డెవలప్‌మెంట్ దశలో ఉంది.
Similar News
News August 6, 2025
ఇది అన్యాయం, అసమంజసం: భారత్

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ 50% సుంకాలు విధించడంపై భారత్ తీవ్రంగా స్పందించింది. అమెరికా తీరు అత్యంత దురదృష్టకరమని అభివర్ణించింది. ఇది ఎంతో అన్యాయమని, అకారణమని, అసమంజసమని స్పష్టం చేసింది. భారత్ తన జాతీయ ప్రయోజనాలను కాపాడుకోవడానికి అన్ని చర్యలు చేపడుతుందని పునరుద్ఘాటించింది. ఇతర దేశాలు కూడా తమ జాతి ప్రయోజనాల కోసం పనిచేస్తున్నాయని విదేశాంగ శాఖ ప్రతినిధి రణ్‌ధీర్ జైస్వాల్ అన్నారు.
News August 6, 2025
ఇందిరా గాంధీని మోదీ ఆదర్శంగా తీసుకోవాలి: కాంగ్రెస్

ఇండియాపై టారిఫ్స్‌ను ట్రంప్ 50%కి పెంచడంతో PM మోదీపై కాంగ్రెస్ ఫైరైంది. ‘2019లో హౌడీ మోదీ ఈవెంట్ నుంచి పాక్‌తో సీజ్‌ఫైర్ వరకు ట్రంప్‌కు మోదీ మద్దతుగా నిలిచారు. అన్ని విషయాల్లో మౌనం పాటించారు. అయినా ట్రంప్ టారిఫ్స్ విధించడం మోదీ వైఫల్యమే. ఇందిరాగాంధీ USను ధైర్యంగా ఎదుర్కొన్నారు. మోదీ ఈగోను పక్కనపెట్టి ఆమెను ఆదర్శంగా తీసుకోవాలి. ఫారిన్ పాలసీ మారాలి’ అని INC జనరల్ సెక్రటరీ జైరాం రమేశ్ ట్వీట్ చేశారు.
News August 6, 2025
భారత్‌పై 50% టారిఫ్స్.. అమల్లోకి ఎప్పటినుంచంటే?

ఇటీవల భారత్‌పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన 25శాతం సుంకాలు రేపటి నుంచి అమల్లోకి వస్తాయని వైట్‌హౌస్ తెలిపింది. తాజాగా విధించిన 25శాతం అదనపు టారిఫ్‌లు 21 రోజుల తర్వాత అమల్లోకి వస్తాయని ప్రకటించింది. దీంతో భారత్ నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యే వస్తువులపై 50శాతం సుంకాలు వర్తించనున్నాయి. ఫలితంగా ఆసియాలో చైనా(51శాతం) తర్వాత అత్యధిక టారిఫ్‌లు ఎదుర్కొంటున్న దేశం భారతే కానుంది.