News August 6, 2025
EP28: వీటికి దూరంగా ఉండాలి: చాణక్య నీతి

ఉన్నత స్థానం పొందాలన్నా గౌరవంగా బతకాలన్నా 3 విషయాలకు దూరంగా ఉండాలని చాణక్య నీతి చెబుతోంది. ‘ఇతరుల ముందు తమను తాము ప్రశంసించుకోవద్దు. దీని వల్ల సమాజంలో వారిపై చెడు అభిప్రాయం ఏర్పడుతుంది. నమ్మకాన్ని కోల్పోతారు. ఇతరుల గురించి చెడుగా మాట్లాడొద్దు. ఇలా చేస్తే వ్యక్తిత్వాన్ని కోల్పోతారు. ఎదుటి వారిలో తప్పులు వెతకడం మానుకోవాలి. ఇతరుల్లో తప్పులు వెతికేవారు తమలోని తప్పుల్ని తెలుసుకోలేరు’ అని బోధిస్తోంది.
Similar News
News August 6, 2025
హెలికాప్టర్ ప్రమాదంలో ‘ఘనా’ మంత్రులు మృతి

ఘనా దేశ రక్షణ మంత్రి, పర్యావరణశాఖ మంత్రి హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఆక్రా నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే వారి హెలికాప్టర్ రాడార్ నుంచి అదృశ్యమైందని అధికారులు పేర్కొన్నారు. మంత్రులు ఎడ్వర్డ్ ఒమేన్ బోమా, ఇబ్రహీం ముర్తాలా మహ్మద్ సహా 8 మంది ఈ ప్రమాదంలో చనిపోయారు. ‘మంత్రులు, జవాన్లు దేశ సేవలో ప్రాణాలు కోల్పోయారు’ అని ఘనా ప్రభుత్వం సంతాపం తెలియజేసింది.
News August 6, 2025
ట్రంప్‌ను లెక్కచేయని భారత్.. రష్యాతో కీలక ఒప్పందం

ట్రేడ్ రిలేషన్స్, సహకారం మరింత పెంచుకునేందుకు భారత్, రష్యా ప్రొటోకాల్ డీల్‌పై సంతకాలు చేశాయి. ఢిల్లీలో జరిగిన మాడర్నైజేషన్&కోఆపరేషన్ వర్కింగ్ గ్రూప్ సెషన్‌లో ఈ నిర్ణయం తీసుకున్నాయి. అల్యూమినియం, ఫెర్టిలైజర్స్, రైల్వేస్, మైనింగ్ టెక్నాలజీ తదితర సెక్టార్స్‌పై చర్చించాయి. వ్యూహాత్మక భాగస్వామ్యానికి కట్టుబడి ఉన్నట్లు తెలిపాయి. రష్యాతో సంబంధాలపై ట్రంప్ హెచ్చరిస్తున్నా భారత్ లెక్కచేయకపోవడం గమనార్హం.
News August 6, 2025
ఇది అన్యాయం, అసమంజసం: భారత్

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ 50% సుంకాలు విధించడంపై భారత్ తీవ్రంగా స్పందించింది. అమెరికా తీరు అత్యంత దురదృష్టకరమని అభివర్ణించింది. ఇది ఎంతో అన్యాయమని, అకారణమని, అసమంజసమని స్పష్టం చేసింది. భారత్ తన జాతీయ ప్రయోజనాలను కాపాడుకోవడానికి అన్ని చర్యలు చేపడుతుందని పునరుద్ఘాటించింది. ఇతర దేశాలు కూడా తమ జాతి ప్రయోజనాల కోసం పనిచేస్తున్నాయని విదేశాంగ శాఖ ప్రతినిధి రణ్‌ధీర్ జైస్వాల్ అన్నారు.