News August 6, 2025
ఎల్లో అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

TG: రాష్ట్రంలో ఇవాళ, రేపు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇవాళ హైదరాబాద్, మేడ్చల్, వికారాబాద్, మెదక్, రంగారెడ్డి, కామారెడ్డి, నాగర్ కర్నూల్, వనపర్తి, గద్వాల్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇతర జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలకు అవకాశం ఉందని పేర్కొంది.
Similar News
News August 7, 2025
75% హాజరు తప్పనిసరి: CBSE

బోర్డు పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు 75% హాజరు తప్పనిసరి అని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) స్పష్టం చేసింది. అటెండెన్స్ రికార్డులు సరిగా లేకపోయినా, విద్యార్థులు క్రమం తప్పకుండా స్కూలుకు రావట్లేదని తేలినా పాఠశాలలపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించింది. అత్యవసర పరిస్థితులు, మెడికల్ ఎమర్జెన్సీ, జాతీయ/అంతర్జాతీయ స్పోర్ట్ ఈవెంట్స్ వంటి కారణాలతో హాజరు కాని వారికి 25% సడలింపు ఉండనుంది.
News August 7, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News August 7, 2025
ఆగస్టు 7: చరిత్రలో ఈరోజు

1907: ఆంధ్ర రాష్ట్ర రెండో ముఖ్యమంత్రి బెజవాడ గోపాలరెడ్డి జననం
1925: హరిత విప్లవ పితామహుడు MS స్వామినాథన్ జననం
1941: విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ మరణం (ఫొటోలో)
1947: తెలుగు హాస్య నటుడు సుత్తివేలు జననం
1980: బ్యాడ్మింటన్ క్రీడాకారుడు చేతన్ ఆనంద్ జననం
2018: తమిళనాడు మాజీ సీఎం ఎం.కరుణానిధి మరణం
☛ జాతీయ చేనేత దినోత్సవం