News March 31, 2024

వృత్తి నైపుణ్య శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

image

నిరుద్యోగ, యువతీ యువకులకు వృత్తి నైపుణ్య శిక్షణలో మూడు నెలల పాటు శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా యువజన క్రీడల అధికారి ఎస్.శ్రీనివాస్ తెలిపారు. బ్యూటీషియన్, ఫ్యాషన్ డిజైనింగ్,జర్దోసి, ఎలక్ట్రిషియన్, మొబైల్ సర్వీసింగ్,రిఫ్రిజిరేటర్, ఏసీ మరమ్మతుల్లో శిక్షణకు యువతీ యువకులు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు.

Similar News

News March 14, 2026

నేడు గద్వాలకు రానున్న సీఎం రేవంత్ రెడ్డి

image

సీఎం రేవంత్ రెడ్డి శనివారం జోగులాంబ గద్వాల జిల్లాకు రానున్నారు. గద్వాల పట్టణంలో జరగనున్న ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి తనయుడు సాయి సాకేత్ రెడ్డి, ఐశ్వర్య వివాహ వేడుకకు సీఎం హాజరుకానున్నారు. మధ్యాహ్నం 12గంటలకు సీఎం గద్వాలకు చేరుకొని నూతన వధూవరులను ఆశీర్వదించనున్నారని పేర్కొన్నారు. సీఎం రాక సందర్భంగా పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు.

News March 14, 2026

MBNR: టెన్త్ పరీక్షలు.. ఎస్పీ కీలక ఆదేశాలు

image

టెన్త్ పరీక్షల సమయంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు పరీక్ష కేంద్రాల పరిసరాలలో ఉన్న ఇంటర్నెట్ సెంటర్లు, జిరాక్స్ షాపులు, స్టేషనరీ దుకాణాలు తాత్కాలికంగా మూసివేయాలని జిల్లా ఎస్పీ డి.జానకి సూచించారు. పరీక్ష ప్రాంతాలలో సభలు, సమావేశాలు, ర్యాలీలు, మైకులు, డిజేలు ఉపయోగించి ఉరేగింపులు, ధర్నాలు, ప్రచార కార్యక్రమాలు నిర్వహించరాదని హెచ్చరించారు. సెక్షన్-163 అమలు చేస్తున్నట్లు తెలిపారు.

News March 13, 2026

MBNR: పదో తరగతి పరీక్షలు.. జిల్లా విద్యాశాఖ కంట్రోల్ రూమ్ ఏర్పాటు

image

మహబూబ్ నగర్ జిల్లాలో ఈనెల 14 నుంచి ఏప్రిల్ 16 వరకు జరగనున్న 10వ తరగతి వార్షిక పరీక్షలను ప్రశాంతంగా నిర్వహించేందుకు జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం చేశారు. ​పరీక్షలకు సంబంధించి విద్యార్థులు, తల్లిదండ్రులు, పరీక్షల నిర్వహణలో పాల్గొనే సిబ్బందికి ఏవైనా సందేహాలున్నా, సమస్యలు ఎదురైతే కంట్రోల్ రూమ్‌ను 83747 72282ను సంప్రదించాలని డీఈవో ప్రవీణ్ కుమార్ సూచించారు.