News August 6, 2025

బంగ్లాదేశ్‌లో ఫిబ్రవరిలో ఎన్నికలు: యూనస్

image

బంగ్లాదేశ్‌లో వచ్చే ఏడాదిలో ఎన్నికలు నిర్వహించనున్నట్లు ప్రధాన సలహాదారు మహమ్మద్ యూనస్ ప్రకటించారు. రంజాన్‌కు ముందు ఫిబ్రవరిలో ఎలక్షన్స్ ఉంటాయని తెలిపారు. ఈ విషయమై ప్రధాన ఎన్నికల కమిషనర్‌కు మధ్యంతర ప్రభుత్వం తరఫున లేఖ రాస్తానని పేర్కొన్నారు. నేటి నుంచే ఎన్నికలకు సన్నద్ధమవుతామన్నారు. వాస్తవానికి బంగ్లాదేశ్‌లో ఏప్రిల్‌లో ఎన్నికలు జరగాల్సి ఉండగా ఈ ప్రకటనతో రెండు నెలల ముందే రానున్నాయి.

Similar News

News August 7, 2025

ప్రభాస్‌తో కలిసి నటిస్తారా?

image

డార్లింగ్ ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించనున్న ‘స్పిరిట్’ సినిమాలో నటించే ఛాన్స్ వచ్చింది. ఈ సినిమా కోసం 13 నుంచి 17 ఏళ్ల మధ్యనున్న మేల్ యాక్టర్స్ కావాలని మేకర్స్ ప్రకటన విడుదల చేశారు. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్లు మూడు ఫొటోలు, రెండు నిమిషాల యాక్టింగ్ వీడియోతో పాటు వివరాలను spirit.bhadrakalipictures@gmail.comకు మెయిల్ చేయాలన్నారు. అలాగే 7075770364కు కాల్ చేయాలని సూచించారు.

News August 7, 2025

డేట్, టైమ్, ప్లేస్ ఫిక్స్ చెయ్.. కిషన్ రెడ్డికి రేవంత్ రెడ్డి సవాల్

image

TG: కులగణన సర్వేపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అసత్యాలు ప్రచారం చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. సర్వేపై ప్రజెంటేషన్ ఇస్తామని, డేట్, టైమ్, ప్లేస్ ఆయనే ఫిక్స్ చేయాలని సవాల్ విసిరారు. ఢిల్లీకి రమ్మన్నా అధికారులను తీసుకొని వస్తానని, కిషన్ రెడ్డి అనుమానాలను నివృత్తి చేస్తామని స్పష్టం చేశారు. ఇక 2029లో కేంద్రం, రాష్ట్రంలో కాంగ్రెస్‌దే విజయమని రేవంత్ ధీమా వ్యక్తం చేశారు.

News August 7, 2025

త్వరలో 3,038 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

image

TGSRTCలో త్వరలో 3,038 ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్ అవుతుందని సంస్థ MD సజ్జనార్ ప్రకటించారు. పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని, నియామక బోర్డుల ద్వారా త్వరలో నోటిఫికేషన్ విడుదల చేస్తామని తెలిపారు. ఈ ప్రక్రియ పూర్తిగా మెరిట్ ఆధారంగా పారదర్శకంగా జరుగుతుందని వెల్లడించారు. ఉద్యోగాలు ఇప్పిస్తామని దళారులు చెబితే నమ్మి మోసపోవద్దని సూచించారు. ఇలాంటి వారిపై పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.