News March 31, 2024

గుంటూరు: ‘లైసెన్స్ గన్స్ స్థానిక పోలీస్ స్టేషన్‌లో అప్పగించాలి’

image

ఎన్నికల కోడ్ అమలులోకి రాగానే యజమానులు తమ లైసెన్స్ తుపాకులను స్థానిక పోలీస్ స్టేషన్‌లో అప్పగించాలని జిల్లా ఎన్నికల అధికారి ఎం. వేణుగోపాల్ రెడ్డి తెలియజేశారు. శనివారం జిల్లా ఎస్పీ తుషార్ దూడీతో కలిసి జిల్లా ఎన్నికల అధికారి లైసెన్స్ గన్స్ అప్పగించడంపై సమావేశం నిర్వహించారు. సరెండర్ చేసిన తుపాకులు ఎన్నికలు ముగిసిన తరువాత సంబంధిత లెటర్‌ చూపించి తీసుకు వెళ్లవచ్చన్నారు.

Similar News

News March 29, 2025

గుంటూరు: నైట్ ఫుడ్ కోర్ట్ విషయంలో చర్చ.!

image

కరోనా ముందు వరకు నైట్ ఫుడ్ కోర్ట్ హిందూ కళాశాల సెంటర్‌లో నడిచింది. మార్కెట్‌కు సరుకు తెచ్చే రైతులు, ఆసుపత్రులకు, బస్టాండ్, రైల్వే స్టేషన్‌కు దగ్గరగా ఉండటంతో బాగా నడిచిందని, ఇప్పుడు వీటన్నిటికీ దూరంగా బ్రాడీపేట, అరండల్ పేటలో ఫుడ్ కోర్టును నిర్వహిస్తే అంత ప్రయోజనకరంగా ఉండదని ప్రజలు చర్చించుకుంటున్నారు. మున్సిపల్ అధికారులు మరోసారి పునరాలోచించి హిందూ కళాశాల రోడ్డులోనే ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నారు. 

News March 29, 2025

ఈ-కేవైసీ చేయకపోతే రేషన్ ఆగిపోతుంది: DSO

image

గుంటూరు జిల్లాలో రేషన్ కార్డుదారులు ఈ-కేవైసీ చేయకపోతే మే 1వ తేదీ నుంచి రేషన్ నిలిపేస్తామని DSO కోమలి పద్మ అన్నారు. ఈ మేరకు శుక్రవారం ఆమె ఓ ప్రకటన విడుదల చేశారు. రేషన్ కార్డు దారులు ఏప్రిల్ చివరి వరకు ఈ-కేవైసీ చేయించుకోవచ్చన్నారు. మొత్తం జిల్లాలో 5.99 లక్షల కార్డులు ఉండగా.. ఇప్పటి వరకు 4.70 లక్షల మంది ఈ-కేవైసీ అప్డేట్ చేయించారన్నారు. మిగిలిన వారు కూడా ఈ-కేవైసీ పూర్తి చేయించాలన్నారు. 

News March 29, 2025

31న జరగాల్సిన పరీక్ష వాయిదా: DEO 

image

ఈనెల 31న రంజాన్ పండుగ సందర్భంగా ఆరోజు జరగవలసిన 10వ తరగతి సోషల్ పరీక్ష ఏప్రిల్ 1వ తేదీకి వాయిదా వేసినట్లు గుంటూరు జిల్లా విద్యాశాఖ అధికారి రేణుక తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. గుంటూరు జిల్లాలోని అన్ని యజమాన్యాల ప్రధానోపాద్యాయులు ఈ విషయం వెంటనే 10వ తరగతి విద్యార్ధులకు తెలియజేయాలని సూచించారు. 

error: Content is protected !!