News August 6, 2025
IPOకు టాటా క్యాపిటల్

పబ్లిక్ ఇష్యూకు వచ్చేందుకు టాటా సన్స్ ఆధ్వర్యంలోని టాటా క్యాపిటల్ సంస్థ సెబీ వద్ద డాక్యుమెంట్లు సమర్పించింది. IPOలో భాగంగా 47.58 కోట్ల ఈక్విటీ షేర్లను విక్రయించనుంది. ఇందులో 21 కోట్ల షేర్లను తాజాగా, మిగతా 26.58 కోట్ల షేర్లను ఆఫర్ ఫర్ సేల్ కింద విక్రయించనుంది. ఈ IPO ద్వారా ₹17,400 కోట్లను సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. SEBI వద్ద దాఖలు చేసిన డాక్యుమెంట్లలో సంస్థ విలువ ₹96,000crగా పేర్కొంది.
Similar News
News August 7, 2025
తాజా సినిమా ముచ్చట్లు

☛ ‘వార్-2’ సినిమాకు U/A 16+ సర్టిఫికెట్ ఇచ్చిన సెన్సార్ బోర్డు.. మూవీ రన్ టైమ్ 3.02 గంటలు
☛ రేపు నేచురల్ స్టార్ నాని ‘ది ప్యారడైజ్’ సినిమా ఫస్ట్ లుక్ విడుదల
☛ మంచు మనోజ్ కొత్త సినిమా టైటిల్ ‘డేవిడ్ రెడ్డి’.. హనుమ రెడ్డి యక్కంటి దర్శకుడు
☛ కన్నడ డైరెక్టర్ A.P.అర్జున్‌తో రవితేజ సినిమా?
☛ కిరణ్ అబ్బవరం ‘K-RAMP’ మూవీ నుంచి ఈ నెల 9న ‘ఓనమ్’ సాంగ్ రిలీజ్
News August 7, 2025
EP29: ఈ అలవాట్లు ఉంటే జీవితం నాశనం: చాణక్య నీతి

కొన్ని అలవాట్లు యువతీ యువకుల జీవితాలను నాశనం చేస్తాయని చాణక్య నీతి చెబుతోంది. ‘యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి. అవి మనుషుల్ని శారీరకంగా, మానసికంగా బలహీనపరుస్తాయి. ఆర్థికంగానూ దెబ్బతినే అవకాశం ఉంటుంది. యువత సోమరితనంగా ఉండొద్దు. అలా ఉంటే జీవిత లక్ష్యాన్ని చేరుకోలేరు. అందుకే క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని గడపాలి. చెడు అలవాట్లు ఉన్నవారితో స్నేహం చేయొద్దు’ అని బోధిస్తోంది.
News August 7, 2025
US టారిఫ్స్.. ఈ రంగాలకు భారీ నష్టం!

US 50% <<17324027>>టారిఫ్స్<<>> విధించడంతో ఆ దేశంలో భారతీయ వస్తువుల ధరలు పెరగనున్నాయి. వస్త్రాలు, చెప్పులు, లెదర్, కెమికల్స్, జువెల్లరీ, సీ ఫుడ్ తదితర రంగాలు భారీగా నష్టపోతాయని నిపుణులు చెబుతున్నారు. ఎగుమతులు 40-50% తగ్గొచ్చని అంటున్నారు. కాగా ట్రంప్ జులై 31న ప్రకటించిన మొదటి రౌండ్ సుంకాలు నేటి నుంచి అమల్లోకి రానున్నాయి. నిన్న విధించిన అదనపు 25% టారిఫ్స్ ఈ నెల 27 నుంచి అమల్లోకి వస్తాయి.