News August 6, 2025
విశాఖ: నేడే ఎన్నిక.. బరిలో 20 మంది

ఈరోజు ఉ.10 గంటలకు జీవీఎంసీ స్థాయి సంఘం ఎన్నికలు మొదలవ్వనున్నాయి. మొత్తం 97మంది <<17313160>>కార్పొరేటర్లు<<>> ఉండగా.. కూటమి తరుఫున 10 మంది, వైసీపీ తరఫున 10మంది పోటీలో ఉన్నాయి. అయితే ఈ ఎన్నికల్లో కూటమికి స్పష్టమైన మెజార్టీ ఉంది. జనసేనలో ఒకరికి కూడా అవకాశం ఇవ్వకపోవడంతో ఎన్నికకు తాను దూరంగా ఉన్నట్లు ఆ పార్టీ కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ప్రకటించారు. మరో కార్పొరేటర్ బి.గంగారావు కూడా ఓటింగ్‌లో పాల్గొనరని సమాచారం.
Similar News
News August 7, 2025
విశాఖలో నిపర్, CGHS కేంద్రాల కోసం ఎంపీ శ్రీభరత్ వినతిపత్రం

విశాఖలో ఫార్మాస్యూటికల్ విద్య, పరిశోధన, ఆరోగ్య సేవల అభివృద్ధికి నిపర్ ఏర్పాటు అవసరమని కోరుతూ ఎంపీ శ్రీభరత్ కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డాను ఢిల్లీలో కలిశారు. విద్యా-పరిశ్రమల అనుసంధానం, పరిశోధన, ఉద్యోగావకాశాలకు ఇది దోహదపడుతుందని వివరించారు. అలాగే కేంద్ర ఉద్యోగుల కోసం రెండు CGHS వెల్నెస్ సెంటర్లు, డైరెక్టరేట్ కార్యాలయాల ఏర్పాటుకు విజ్ఞప్తి చేశారు.
News August 7, 2025
విశాఖ: లూజ్‌లో పెట్రోల్ అమ్మకాలు

విశాఖలోని పలు పెట్రోల్ బంకులు నిబంధనలకు తూట్లు పొడుస్తున్నాయి. డైరీ ఫారం సమీపంలోని ఓ బంక్‌లో లూజు పెట్రోల్ అమ్ముతున్నారు. దీంతో కల్తీ పెట్రోల్ అమ్మకాలతో పాటు నేరాల చేసేందుకు ఆస్కారం ఉంది. అధికారులు స్పందించి లూజ్ విక్రయాలు నివారించాలని ప్రజలు కోరుతున్నారు.
News August 7, 2025
బక్కన్నపాలెంలో 22.64 ఎకరాలు కేటాయించాం: విశాఖ ఎంపీ

కేంద్ర మంత్రి వీరేందర్ కుమార్‌ను ఎంపీ శ్రీభరత్ బుధవారం కలిసి డిసెబిలిటీ స్పోర్ట్స్ సెంటర్ పనులు వేగవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. గంభీరం భూమి అనువుకాదని, కొత్తగా బక్కన్నపాలెంలో 22.64 ఎకరాలు కేటాయించామని తెలిపారు. కేంద్ర-రాష్ట్ర అధికారులు పరిశీలించి ఆమోదించారని, త్వరితంగా అనుమతులు మంజూరు చేయాలని కోరారు. ఈ హబ్ దివ్యాంగ అథ్లెట్లకు శిక్షణా కేంద్రంగా మారుతుందని తెలిపారు.