News March 31, 2024

శ్రీకాకుళం: ఏఆర్‌సీలో ఎలుగుబంటి మృతి

image

విశాఖ జంతు పునరావాస కేంద్రం(ఏఆర్‌సీ)లో మగ ఎలుగుబంటి మృతి చెందింది. ఈ ఎలుగుబంటి అడవి నుంచి కొద్ది నెలల కిందట శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరులోని జనారణ్యంలోకి చేరి అక్కడి స్థానికులను భయబ్రాంతులకు గురి చేసింది. దీన్ని అటవీశాఖ అధికారులు బంధించి విశాఖ జూకు తీసుకొచ్చారు. అప్పటి నుంచి జూ అధికారులు ఈ ఎలుగుబంటిని ఏఆర్‌సీలో సంరక్షిస్తున్నారు. వృద్ధాప్యం, అనారోగ్యం కారణంగా శనివారం వేకువజామున మరణించింది.

Similar News

News February 20, 2026

శ్రీకాకుళం: కొత్త పంచాయతీలు ఎన్ని ఏర్పడతాయో?

image

శ్రీకాకుళం జిల్లాలో 30 మండలాల్లో 912 పంచాయతీలు ఉన్నాయి. జిల్లాలో చాలాచోట్ల కొత్త పంచాయతీలు ఏర్పాటు కోసం అధికారులకు ప్రతిపాదనలు పంపారు. కొత్తగా 64 పంచాయతీల ప్రతిపాదనలు అధికారులు రాష్ట్ర పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయానికి పంపారు. 35 కొత్త పంచాయతీలు ఏర్పాటుకు కమిషనర్ కార్యాలయం నుంచి ఆమోదం లభించింది. ఇంకా కొత్త పంచాయతీలు ఏర్పాటుపై పూర్తిస్థాయిలో స్పష్టత రావాల్సి ఉంది.

News February 20, 2026

B.Ed సెమిస్టర్ పరీక్షల టైం టేబుల్ విడుదల

image

శ్రీకాకుళం జిల్లా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ B.Ed మొదటి సెమిస్టర్ పరీక్షల టైం టేబుల్ విడుదలైంది. ఈ మేరకు యూనివర్సిటీ పరీక్షల విభాగం అధికారి డాక్టర్ ఉదయ్ భాస్కర్ విడుదల చేశారు. కాగా ఈ పరీక్షలు జనవరి 27 నుంచి ఫిబ్రవరి 2వ తేదీ వరకు జరగాల్సి ఉండగా పలు కారణాలతో వాయిదా వేశారు. దీనితో కొత్త తేదీలను ప్రకటించారు. ఈనెల 24 నుంచి మార్చి 2వ తేదీ వరకు మధ్యాహ్నం 2 నుంచి 5 వరకు జరుగుతాయని తెలిపారు.

News February 20, 2026

శ్రీకాకుళం మీదుగా స్పెషల్ ట్రైన్స్

image

శ్రీకాకుళం జిల్లా రైల్వే ప్రయాణికులకు ఈస్ట్ కోస్ట్ రైల్వే శాఖ శుభవార్త తెలిపింది. రానున్న హోలీ పండుగ నేపథ్యంలో జిల్లా మీదుగా సాంత్రగచ్చి-యెలహంక-సాంత్రగచ్చి(నం.02863/64) వీక్లీ స్పెషల్ ఎక్స్ప్రెస్ రైలు నడపనున్నట్లు ప్రకటించింది. ఈ రైలు శ్రీకాకుళం రోడ్డు, పలాస స్టేషన్లలో ఆగనుందని రైల్వేశాఖ జనరల్ మేనేజర్ పరమేశ్వర్ ఒక ప్రకటనలో వెల్లడించారు. ఈ రైలు మార్చి 5వ తేదీ నుంచి 28వ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది.