News August 6, 2025

HYD: పోలీసు కార్యాలయాల్లో పాత వస్తువుల వేలం

image

హైదరాబాద్ సిటీ పోలీస్ హెడ్ క్వార్టర్స్, పెట్లబుర్జు కార్యాలయంలోని పాత వస్తువులు వేలం వేయనున్నారు. ఈనెల 7వ తేది ఉ.11 గంటలకు వేలం వేస్తున్నట్లు DCP రక్షిత కృష్ణమూర్తి ప్రకటించారు. ఈ వేలంలో పాత ఐరన్, ఏసీలు, టెంట్, చెక్క కుర్చీలు, ఫర్నిచర్స్, హెల్మెట్స్, ఎయిర్‌కూలర్లు, ప్లాస్టిక్ కుర్చీలు వేలం వేయనున్నారు. ఆసక్తి గలవారు CI రవి 8712661326ని సంప్రదించాలన్నారు.

Similar News

News August 9, 2025

జూబ్లీహిల్స్‌లో కుల రాజకీయం

image

జూబ్లీహిల్స్ బై‌పోల్ ముంగిట రాజకీయం ‘కుల’ రంగు పులుముకుంటోంది. కమ్మ కులానికి BRS అన్యాయం చేస్తోందన్న విమర్శలను ఆ పార్టీ నేతలు ఖండిస్తున్నారు. CMకు ప్రేమ ఉంటే కమ్మ నేతకే టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ.. BRS కూడా ఆ సామాజికవర్గానికి చెందిన నేతనే నిలబెడుతుందని తేల్చిచెప్పారు. అయితే, సెగ్మెంట్‌లో కమ్మ ఓట్లు 50 వేలు ఉన్నాయని, పార్టీ ఏదైనా తమకే టికెట్ ఇవ్వాలని కమ్మ రాజకీయ ఐక్యవేదిక పట్టుబట్టడం గమనార్హం.

News August 9, 2025

నిజాంపేటలో వల్లి సిల్క్స్ ప్రారంభం

image

హైదరాబాద్‌లో సిల్క్ వస్త్రాలకు పేరుగాంచిన వల్లి సిల్క్స్ నూతన బ్రాంచ్‌ను నిజాంపేటలో ప్రారంభించారు. ప్రజలకు మరింత చేరువలో నాణ్యమైన సిల్క్ వస్త్రాలను అందించే లక్ష్యంతో ఈ బ్రాంచ్ ప్రారంభించినట్లు వల్లి సిల్క్స్ యాజమాన్యం ప్రకటించింది. ప్రారంభోత్సవ సందర్భంగా ప్రత్యేక ఆఫర్లు, రాఖీ సందర్భంగా రూ.99 కే చీర అందిస్తున్నట్లు తెలిపారు. ఈ ఆఫర్లను కస్టమర్లు సద్వినియోగం చేసుకోవాలంది.

News August 9, 2025

సృష్టి కేసు అప్డేట్ : సిటీ పోలీసుల అదుపులో వైజాగ్ వైద్యులు

image

సృష్టి అక్రమ సరోగసి కేసులో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ కేసులో కీలక పాత్ర పోషించిన వైజాగ్‌ కింగ్ జార్జ్ ఆస్పత్రికి చెందిన ముగ్గురు వైద్యులను HYD పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్టైన వారిలో కేజీహెచ్ డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ రవి, డాక్టర్ ఉషాదేవి, డాక్టర్ రమ్య ఉన్నారు. వీరంతా ప్రధాన నిందితురాలు నమ్రతకు సహకరించినట్లు పోలీసులు గుర్తించారు. ఇప్పటి వరకు అరెస్టుల సంఖ్య 25కు చేరింది.