News August 6, 2025
నేడు ఢిల్లీలో రేవంత్ సర్కార్ ధర్నా

TG: ఇవాళ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద రాష్ట్ర ప్రభుత్వం ధర్నాకు దిగనుంది. బీసీలకు 42% రిజర్వేషన్ బిల్లును కేంద్రం ఆమోదించాలని డిమాండ్ చేస్తూ నిరసన చేపట్టనుంది. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, రాహుల్, సీఎం రేవంత్‌తో పాటు ఇండియా కూటమి నేతలు పాల్గొననున్నారు. ఇప్పటికే పలువురు మంత్రులు, MLAలు, ఎమ్మెల్సీలు, కార్యకర్తలు ఢిల్లీకి చేరుకున్నారు. కాగా కేంద్రం ఈ బిల్లుపై ఎలా స్పందిస్తుందనే ఉత్కంఠ నెలకొంది.
Similar News
News August 7, 2025
భారీ వర్షాలు.. అప్రమత్తంగా ఉండండి: సీఎం రేవంత్

TG: రాష్ట్రంలో ఇవాళ, రేపు భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలపై CM రేవంత్ స్పందించారు. ‘భారీ వర్షాల సమాచారం దృష్ట్యా కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలి. జిల్లాల్లోని అన్ని విభాగాలతో ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలి. HYDలో భారీ వర్షసూచన దృష్ట్యా అధికారులు సమన్వయంతో పని చేయాలి. వర్షాలతో ఇబ్బందులు పడుతున్న ప్రాంతాలకు వెంటనే సంబంధిత సిబ్బంది చేరుకొని చర్యలు చేపట్టాలి’ అని ఆదేశించారు.
News August 7, 2025
రోజూ మాంసం తింటే..!

ముక్క లేనిదే ముద్ద దిగదు అనేవారు ఎక్కువ కాలం జీవించలేరని ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ అధ్యయనంలో వెల్లడైంది. రోజూ లేదా వారానికి మూడు కంటె ఎక్కువ సార్లు ప్రాసెస్డ్ & రెడ్ మీట్ తినడం ఆరోగ్యానికి హానికరం అని తేలింది. 4,75,000 మందిపై చేసిన అధ్యయనంలో మాంసం తినడం వల్ల క్యాన్సర్, గుండె జబ్బులు, డయాబెటిస్ వంటి 25 రకాల ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం పెరుగుతుందని గుర్తించారు. పరిమితంగా మాంసం తినొచ్చని సూచించారు.
News August 7, 2025
ధనుష్ సిస్టర్స్‌ను ఫాలో అవుతున్న మృణాల్.. నెట్టింట చర్చ

తమిళ స్టార్ హీరో ధనుష్, హీరోయిన్ మృణాల్ ఠాకూర్ డేటింగ్‌లో ఉన్నారనే పుకార్లు షికార్లు కొడుతున్నాయి. వారం రోజులుగా ఇది జరుగుతున్నా ఇద్దరూ దీనిని ఖండించలేదు. ఇదిలా ఉండగా మృణాల్ తన ఇన్‌స్టా అకౌంట్‌లో ధనుష్ సిస్టర్స్ అయిన కార్తీక, విమల గీతను ఫాలో అవడం చర్చనీయాంశమైంది. వీరిద్దరు కూడా ఆమెను తిరిగి ఫాలో అవుతుండటం ప్రేమ పుకార్లకు మరింత ఆజ్యం పోస్తోంది. కాగా వీరిద్దరూ ఇప్పటివరకూ కలిసి పనిచేయలేదు.