News August 6, 2025

‘రాజాసాబ్’ పార్ట్-2 ఉంటుంది: విశ్వప్రసాద్

image

ప్రభాస్ హీరోగా తెరకెక్కుతోన్న ‘రాజాసాబ్’కు పార్ట్-2 ఉంటుందని నిర్మాత విశ్వప్రసాద్ తెలిపారు. అయితే జోనర్ వేరే ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. ‘రాజాసాబ్’ రిలీజ్ వాయిదా ప్రచారంపై స్పందిస్తూ తెలుగు ఆడియన్స్ జనవరిలో రిలీజ్ చేయమని కోరుతున్నట్లు చెప్పారు. డిసెంబర్‌లో అయితే హిందీ మార్కెట్‌కు అనుకూలిస్తుందని అన్నారు. ఈ విషయమై ఆలోచిస్తున్నామన్నారు. కాగా రాజాసాబ్ Dec 5న విడుదలవుతుందని ఇప్పటికే ప్రకటించారు.

Similar News

News August 7, 2025

మాజీ IPS రఘువీర్‌రెడ్డిపై విచారణకు ఆదేశం

image

AP: 2024లో నంద్యాల SPగా పని చేసిన మాజీ IPS రఘువీర్‌రెడ్డిపై వచ్చిన అభియోగాలపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. నంద్యాల YCP అభ్యర్థి శిల్పా రవిని హీరో అల్లుఅర్జున్ కలిసిన సమయంలో భారీ ర్యాలీకి అనుమతించారని, అదే రోజు చంద్రబాబు పర్యటన ఉండగా వైసీపీ ర్యాలీకి పర్మిషన్ ఇచ్చారని ఆయనపై అభియోగాలున్నాయి. ఇతర ఆరోపణలపైనా విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఇంటెలిజెన్స్ ఐజీ రామకృష్ణను విచారణాధికారిగా CS నియమించారు.

News August 7, 2025

ప్రెగ్నెంట్ అని తెలిసినా కనికరించలేదు: రాధిక

image

తాను ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు సెట్‌లో ఎదురైన చేదు అనుభవాలను హీరోయిన్ రాధికా ఆప్టే పంచుకున్నారు. ‘నేను ప్రెగ్నెంట్‌గా ఉన్న సమయంలో ఓ బాలీవుడ్ సినిమాలో నటిస్తున్నా. ఈ విషయం తెలిసి ఆ చిత్ర నిర్మాత కసురుకున్నారు. షూటింగ్‌లో టైట్ దుస్తులు ధరించాల్సి వచ్చింది. డాక్టర్‌ను కలిసేందుకు కూడా ఒప్పుకోలేదు. నొప్పిగా ఉన్నా కూడా షూటింగ్ అలాగే కొనసాగించారు. అప్పుడు ఎంతో బాధపడ్డా’ అంటూ ఆమె చెప్పుకొచ్చారు.

News August 7, 2025

పోలీసులు, టీడీపీ నేతల కుమ్మక్కు: బొత్స

image

AP: రాష్ట్రంలో పోలీసులు, TDP నేతలు కుమ్మక్కై YCP నేతలపై దాడులకు పాల్పడుతున్నారని ఆ పార్టీ నేత బొత్స సత్యనారాయణ ఆరోపించారు. కూటమి సర్కార్ దుష్ట పాలన చేస్తోందని మండిపడ్డారు. గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను బొత్స, కారుమూరి, కొట్టు, వెల్లంపల్లి కలిశారు. ‘కూటమి ప్రభుత్వ అరాచకాలపై గవర్నర్‌కు ఫిర్యాదు చేయగా సానుకూలంగా స్పందించారు. ప్రజాస్వామ్యబద్ధంగా పులివెందుల ZPTC ఎన్నిక నిర్వహించాలని కోరాం’ అని తెలిపారు.