News August 6, 2025
ఖమ్మం: ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

గ్రూప్స్, RRB, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ తదితర పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న మైనార్టీ అభ్యర్థులకు రాష్ట్ర మైనార్టీ స్టడీ సర్కిల్ ద్వారా 4 నెలల పాటు శిక్షణ ఇవ్వనున్నారు. ఆసక్తి ఉన్న ముస్లిం, క్రిస్టియన్, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్సీ అభ్యర్థులు ఈనెల 21లోగా దరఖాస్తు చేసుకోవాలని ఖమ్మం జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి బి.పురంధర్ తెలిపారు. దరఖాస్తులను కలెక్టరేట్లోని తమ కార్యాలయంలో సమర్పించాలన్నారు.
Similar News
News August 7, 2025
కూసుమంచి: యూటీ పనులను పరిశీలించిన ఇరిగేషన్ సీఈ, ఎస్ఈ

కూసుమంచి మండలం పాలేరు సాగర్ ఎడమ కాలువ వద్ద రూ.14 కోట్లతో నిర్మిస్తోన్న యూటీ(అండర్ టన్నెల్) పనులను గురువారం ఇరిగేషన్ శాఖ సీఈ, ఎస్ఈ మంగళపూడి వెంకటేశ్వర్లు పరిశీలించారు. వారు మాట్లాడుతూ.. మంత్రి ఆదేశాల మేరకు యుద్ధ ప్రాతిపదికన పనులను గుత్తేదారు గోపాలరావు మూడు షిప్టుల్లో పగలు, రాత్రి తేడా లేకుండా నాణ్యత ప్రమాణాలతో పూర్తి చేశారని, మిగిలిన చిన్న పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు.
News August 7, 2025
ఖమ్మం: జల్ జీవన్ మిషన్‌పై కలెక్టర్లకు వీసీ

జల్ జీవన్ మిషన్ పనులపై కేంద్ర అదనపు కార్యదర్శి కమల్ కిషోర్ సోన్ ఈరోజు వీడియో కాన్ఫరెన్స్‌ను నిర్వహించారు. తెలంగాణ, ఝార్ఖండ్, అరుణాచల్ కలెక్టర్లతో వీసీలో ఖమ్మం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి పాల్గొన్నారు. మిషన్ పనులను పర్యవేక్షించేందుకు డాష్ బోర్డు ఏర్పాటు చేసినట్లు కమల్ కిషోర్ తెలిపారు. ప్రతి జిల్లా పరిధిలోని పనులను పర్యవేక్షించాలని, దిశ సమావేశాలను రెగ్యులర్‌గా నిర్వహించి, ఆన్‌లైన్‌లో ఉంచాలన్నారు.
News August 7, 2025
ఖమ్మం జిల్లా కలెక్టర్ కీలక ఆదేశాలు

ఖమ్మం జిల్లాలో రెవెన్యూ సదస్సుల ద్వారా వచ్చిన 75,000 భూ సమస్యల దరఖాస్తుల పరిష్కారాన్ని ఆగస్టు 15 నాటికి పూర్తి చేయాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అధికారులను ఆదేశించారు. 49,000 సాదా బైనామా దరఖాస్తులకు వెంటనే నోటీసులు ఇవ్వాలని తెలిపారు. ప్రతి దరఖాస్తును వేగంగా, పారదర్శకంగా పరిష్కరించాలని, ర్యాండమ్ చెకింగ్ ద్వారా తప్పులు నివారించాలని సూచించారు. సెలవులు లేకుండా రెవెన్యూ సిబ్బంది కృషి చేయాలన్నారు.