News August 6, 2025

రూ.1,000 పెరిగిన వెండి ధర

image

బంగారం ధరలు వరుసగా మూడో రోజు పెరిగాయి. హైదరాబాద్‌లో ఇవాళ 24 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర ₹110 పెరిగి ₹1,02,330కు చేరింది. ఇక 22 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాముల ధర ₹100 పెరిగి ₹93,800 పలుకుతోంది. 5 రోజుల్లో బంగారం ధర రూ.2,510 పెరగడం గమనార్హం. అటు కేజీ వెండిపై రూ.1,000 పెరిగి రూ.1,26,000గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.

Similar News

News August 7, 2025

ఈ నెల 22న చిరు-అనిల్ మూవీ గ్లింప్స్‌?

image

అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నెల 22న చిరంజీవి బర్త్ డే సందర్భంగా ఈ సినిమా టైటిల్ గ్లింప్స్‌ను విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. షైన్ స్క్రీన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాలో నయనతార హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ మూవీని వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేయనున్నట్లు నిర్మాతలు ఇప్పటికే ప్రకటించారు.

News August 7, 2025

సిరాజ్, ప్రసిద్ధ్‌లకు కెరీర్ బెస్ట్ ర్యాంకింగ్స్

image

ICC తాజాగా ప్రకటించిన టెస్ట్ ర్యాంకింగ్స్‌లో భారత పేసర్లు సిరాజ్, ప్రసిద్ధ్‌లు కెరీర్ బెస్ట్ ర్యాంకులను పొందారు. సిరాజ్ 12 స్థానాలు ఎగబాకి 15వ ర్యాంకులో, ప్రసిద్ధ్ 25 స్థానాలు ఎగబాకి 59th ర్యాంకులో నిలిచారు. బుమ్రా తొలి స్థానంలో కొనసాగుతున్నారు. టెస్ట్ బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో జైస్వాల్ 5, పంత్ 8, గిల్ 13వ స్థానాల్లో నిలిచారు. ఆల్‌రౌండర్ల జాబితాలో జడేజా తొలి స్థానంలో, సుందర్ 16వ స్థానంలో ఉన్నారు.

News August 7, 2025

వచ్చే వారంలో ట్రంప్, పుతిన్ భేటీ!

image

US ప్రెసిడెంట్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్ వచ్చే వారం భేటీ అయ్యే అవకాశాలున్నాయి. ట్రంప్ తొలుత పుతిన్‌తో వ్యక్తిగతంగా సమావేశమవుతారని, ఆ తర్వాత ఉక్రెయిన్ అధ్యక్షుడితో కలిసి రష్యాతో సీజ్ ఫైర్‌పై చర్చిస్తారని అంతర్జాతీయ మీడియా పేర్కొంది. ‘రష్యన్లు ట్రంప్‌ను కలవాలనుకుంటున్నారు. రష్యా, ఉక్రెయిన్ దేశాధినేతలతో మాట్లాడి యుద్ధాన్ని ముగించాలని ట్రంప్ కోరుకుంటున్నారు’ అని వైట్‌హౌస్ ఓ ప్రకటనలో పేర్కొంది.