News August 6, 2025
సినీ కార్మికుల్లో చీలిక తెచ్చే ప్రయత్నం: అనిల్

కొందరు నిర్మాతలు సినీ కార్మికుల్లో చీలిక తెచ్చే ప్రయత్నం చేస్తున్నారని ఫెడరేషన్ ప్రెసిడెంట్ అనిల్ వల్లభనేని వ్యాఖ్యానించారు. తాము నిర్మాతలను ఇబ్బంది పెట్టడం లేదన్నారు. తమకు స్కిల్ లేదనడం సరికాదని, ఇక్కడ ఉన్నవాళ్లకు పని కల్పించి తర్వాత పక్క రాష్ట్రం వాళ్లను తెచ్చుకోవాలని సూచించారు. తమ సమస్యలను వివరించేందుకు ఇవాళ ఫెడరేషన్ సభ్యులు మెగాస్టార్ చిరంజీవిని కలిసే అవకాశముంది. నిన్న నిర్మాతలు ఆయనను కలిశారు.
Similar News
News August 6, 2025
AP క్యాబినెట్ భేటీ నిర్ణయాలు

*40 వేల సెలూన్లకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్
*భవానీ ఐల్యాండ్, అరకులో మరిన్ని సౌకర్యాలు
*వైష్ణవి ఇన్‌ఫ్రాకు 25 ఎకరాల TTD భూమి కేటాయింపునకు అంగీకారం
*ఫార్చ్యూన్-500 లిస్టులోని IT సంస్థలకు తక్కువ ధరకే భూములు
* భూములు పొందిన ఐటీ సంస్థలైతే 3 వేలు, GCCల్లోనైతే 2 వేల ఉద్యోగాలు కల్పించాలి
*రూ.900 కోట్ల APBDCL రుణాలకు ప్రభుత్వ హామీకి అంగీకారం
*ప్రభుత్వ సంస్థలకు తక్కువ ధరలకే భూముల కేటాయింపు
News August 6, 2025
‘ఫ్రీ బస్సు’ పథకం అధికారిక వివరాలు ఇవే

AP: మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం పథకానికి క్యాబినెట్ ఆమోదం తెలిపిందని మంత్రి పార్థసారథి వెల్లడించారు. ‘ఆగస్టు 15 నుంచి రాష్ట్రవ్యాప్తంగా స్త్రీశక్తి పథకాన్ని అమలు చేయనున్నాం. RTCలోని 75%(8,456) బస్సుల్లో ఉచితంగా ప్రయాణించొచ్చు. పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, మెట్రో ఎక్స్‌ప్రెస్, ఎక్స్‌ప్రెస్ సర్వీసుల్లో పథకం అమలవుతుంది. కుటుంబానికి నెలకు రూ.800 ఆదా అవుతుందని భావిస్తున్నాం’ అని తెలిపారు.
News August 6, 2025
త్వరలో మఠానికి మాధురి.. సీఎం ట్వీట్

మాధురి(ఏనుగు)ని తిరిగి మహారాష్ట్రకు తీసుకొచ్చేందుకు సీఎం ఫడణవీస్ ‘వనతారా’ అధికారులతో సమావేశమయ్యారు. ఏనుగును తిరిగి తీసుకొచ్చేందుకు సుప్రీంలో దాఖలు చేసిన పిటిషన్‌కు తాము సహకరిస్తామని వనతారా సిబ్బంది హామీ ఇచ్చినట్లు సీఎం ట్వీట్ చేశారు. మాధురి తిరిగి వస్తుందని తెలియడంతో మఠానికి చెందిన భక్తులు, స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమ సైలెంట్ <<17311952>>ఉద్యమం<<>> ఫలించిందని పోస్టులు పెడుతున్నారు.