News March 31, 2024
ADB: అక్క పెళ్లి రోజే తమ్ముడు బలవన్మరణం

ఉట్నూర్ మండలంలో విషాదం చోటు చేసుకుంది. అక్క పెళ్లి రోజే తమ్ముడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. పోలీసుల వివరాల ప్రకారం లక్షటిపేటకి చెందిన అర్కవినోద్(25) ఉట్నూర్‌లో డిగ్రీ చదువుతున్నాడు. శుక్రవారం అక్క అర్క అనసూయ పెళ్లికి కుటుంబ సభ్యులు, బంధువులు అంతా నార్నూర్ వెళ్లారు. వినోద్ ఇంటి వద్దే ఉండి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఎప్పుడూ ఒంటరితనంతో మానసికంగా కుంగిపోయి ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై తెలిపారు.
Similar News
News March 10, 2026
ADB: నేటి INTER పరీక్షకు 385 మంది గైర్హాజరు

ఆదిలాబాద్ జిల్లాలో మంగళవారం ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని DIEO జాధవ్ గణేష్ కుమార్ తెలిపారు. మొత్తం 8,520 మంది విద్యార్థులకు గాను 8,135 మంది హాజరయ్యారని డీఐఈఓ జాదవ్ గణేశ్ కుమార్ తెలిపారు. జనరల్ విభాగంలో 292 మంది, ఒకేషనల్ విభాగంలో 93 మంది కలిపి మొత్తం 385 మంది గైర్హాజరయ్యారని పేర్కొన్నారు.
News March 10, 2026
ఆదిలాబాద్ సింగం.. ONE YEAR COMPLETE

ఆదిలాబాద్ జిల్లా SPగా అఖిల్ మహాజన్ బాధ్యతలు చేపట్టి నేటికి ఏడాదయింది. ఈ ఏడాది కాలంలో ప్రజలు సేవలందించడంలో తనదైన ముద్ర వేసుకున్నారు. ఎన్నో కార్యక్రమాలు చేపట్టి రౌడీ షీటర్లపై ఉక్కుపాదం మోపారు. క్రైంను అదుపులోపెట్టి మహిళలకు అండగా ఉంటూ దోపిడీదారుల పాలిట సింహ స్వప్నంలా మారారు. శాఖలో మార్పులు, కట్టుదిట్టమైన భద్రత ఉంటే ఇలాంటి ఎస్పీనే ఉండాలంటూ ఆదిలాబాద్ కా షేర్, సింగం అంటూ ప్రజల నుంచి మన్ననలు పొందారు.
News March 9, 2026
ఆదిలాబాద్: ఇంటర్ పరీక్షకు.. 527 మంది గైర్హాజరు

ఆదిలాబాద్ జిల్లాలో ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు సోమవారం ప్రశాంతంగా జరిగాయి. మొత్తం 9,232 మంది విద్యార్థులకు గాను 8,705 మంది హాజరయ్యారని డీఐఈఓ జాదవ్ గణేశ్ కుమార్ తెలిపారు. జనరల్ విభాగంలో 399 మంది, ఒకేషనల్ విభాగంలో 128 మంది కలిపి మొత్తం 527 మంది గైర్హాజరయ్యారని పేర్కొన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు చెప్పారు.


