News August 6, 2025

బీసీ రిజర్వేషన్లతోనే స్థానిక ఎన్నికలు: భట్టి

image

TG: బీసీ రిజర్వేషన్లతోనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని Dy.CM భట్టి విక్రమార్క అన్నారు. రిజర్వేషన్లు సాధిస్తామనే నమ్మకం ఉందని, కేంద్రం త్వరగా ఆమోదం తెలపాలని డిమాండ్ చేశారు. ఢిల్లీలో చేపట్టిన ధర్నాలో ఆయన మాట్లాడారు. మరోవైపు కాంగ్రెస్‌కు అన్ని కులాలు, మతాలు సమానమేనని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. రిజర్వేషన్ల విషయంలో BJP డబుల్ గేమ్ ఆడుతోందని TPCC చీఫ్ మహేశ్ ఫైరయ్యారు.

Similar News

News August 7, 2025

మళ్లీ పెరిగిన గోల్డ్ & సిల్వర్ రేట్స్!

image

బంగారం ధరలు క్రమంగా పెరుగుతూ కొనుగోలుదారులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. వరుసగా నాలుగో రోజూ పెరిగి షాకిచ్చాయి. హైదరాబాద్‌లో ఇవాళ 24 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర ₹220 పెరిగి ₹1,02,550కు చేరింది. ఇక 22 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాముల ధర ₹200 పెరిగి ₹94,000 పలుకుతోంది. అటు కేజీ వెండిపై రూ.1,000 పెరిగి రూ.1,27,000గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.

News August 7, 2025

IPL.. కెప్టెన్ మాతోనే ఉంటారు: RR

image

IPLలో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ ఆ జట్టును వీడి CSK లేదా KKRలోకి వెళ్తారంటూ కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. దీనిని ఖండించిన RR యాజమాన్యం సంజూను వదులుకునేది లేదని స్పష్టం చేసింది. అతడు తమ జట్టుకు ముఖ్యమైన, తిరుగులేని కెప్టెన్ అని చెప్పింది. సంజూతో పాటు మరే ఆటగాడిని ట్రేడ్ చేసేందుకు ఇప్పటివరకు ఎలాంటి చర్చ జరగలేదని RR వెల్లడించింది.

News August 7, 2025

ఇవాళ 3 పథకాలు ప్రారంభం

image

AP: చేనేత కార్మికుల కోసం 3 పథకాలను ప్రభుత్వం ఇవాళ ప్రారంభించనుంది. కార్మికులకు 200 యూనిట్లు, మరమగ్గాలకు 500 యూనిట్ల ఫ్రీ కరెంట్ అందించే స్కీంను జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా మంగళగిరిలో CM చంద్రబాబు ప్రారంభిస్తారు. చేనేత దుస్తులపై 5% GST మినహాయింపు, చేనేతలకు హెల్త్ ఇన్సూరెన్స్‌పై CM ప్రకటించనున్నారు. ప్రభుత్వం సుమారు 2.5 లక్షల చేనేత కార్మికుల జీవనోపాధిని బలోపేతం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది.