News August 6, 2025

రాజమండ్రి: పోలింగ్ కేంద్రాలను సందర్శించిన కలెక్టర్

image

రాజమండ్రి సిటీ నియోజకవర్గంలోని పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ ప్రక్రియలో భాగంగా కలెక్టర్, రిటర్నింగ్ అధికారి పి. ప్రశాంతి బుధవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రాజమండ్రిలో 241 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని ఆమె తెలిపారు. 2026 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఓటర్ల జాబితాను అనుసరించి, వారికి సమీపంలో పోలింగ్ కేంద్రాలు ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.

Similar News

News August 9, 2025

రాజమండ్రిలో ఈ నెల 11న జాబ్ మేళా

image

తూ.గో జిల్లా ఉపాధి కార్యాలయం ఆధ్వర్యంలో ఆగస్టు 11వ తేదీన రాజమండ్రిలో మోడల్ కెరీర్ సెంటర్ ప్రాంగణంలో ‘జాబ్ మేళా’ నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి హెచ్.హరీష్ చంద్ర ప్రసాద్ తెలిపారు. ఈ మేరకు శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ జాబ్ మేళాలో ఇన్నోవా సోర్స్, SBI పేమెంట్, నవతా తదితర ప్రముఖ కంపెనీలులో పాల్గొంటాయన్నారు. టెన్త్, ఇంటర్, డిగ్రీ చదివి 19-30 సంవత్సరాలలోపు వయస్సు గల వారు అర్హులని వివరించారు.

News August 9, 2025

రాజమండ్రి: పోలీస్ అధికారులకు రాఖీ కట్టిన మాజీ హోంమంత్రి

image

రాఖీ పండుగ సందర్భంగా రాజమండ్రికి విచ్చేసిన మాజీ హోం మంత్రి తానేటి వనిత శనివారం ఎయిర్‌పోర్ట్‌లో పోలీసు, సీఐఎస్‌ఎఫ్ అధికారులకు ఆప్యాయంగా రాఖీలు కట్టారు. శ్రావణ మాసంలో సోదర, సోదరీమణుల అనుబంధాన్ని రాఖీ పౌర్ణమి గుర్తు చేస్తుందని ఆమె అన్నారు. అందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

News August 9, 2025

కొవ్వూరు వద్ద రోడ్డు ప్రమాదం.. ఇద్దరి మృతి

image

కొవ్వూరు సమీపంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పెరవలి మండలం కానూరు అగ్రహారానికి చెందిన దవులూరి సుబ్రహ్మణ్యం (44), లంకే ప్రసాద్ (26) మృతి చెందారు. కడియపులంకలో పనికి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా విజ్జేశ్వరం-సీతంపేట వద్ద వీరి వాహనాన్ని లారీ ఢీకొట్టింది. మృతదేహాలను కొవ్వూరు ఆస్పత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న మంత్రి కందుల దుర్గేశ్ ఆస్పత్రికి చేరుకుని మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు.