News August 6, 2025

వాట్సాప్‌లో అదిరిపోయే ఫీచర్

image

స్కామ్స్ నుంచి యూజర్లను రక్షించేందుకు ‘వాట్సాప్’ కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ‘సేఫ్టీ ఓవర్‌వ్యూ’ పేరిట ఉన్న ఈ ఫీచర్.. మీ కాంటాక్ట్స్‌లో లేని వ్యక్తి మిమ్మల్ని తెలియని గ్రూపుల్లో యాడ్ చేసే సమయంలో పనిచేస్తుంది. గ్రూప్ ఓపెన్ చేయకముందే క్రియేట్ చేసిన వారి వివరాలు వెల్లడించి, నిష్క్రమించే అవకాశం ఇస్తుంది. దీనికి స్పందించే వరకూ గ్రూప్ మ్యూట్‌లో ఉంటుంది. త్వరలో ఇది అందరికీ అందుబాటులోకి రానుంది.

Similar News

News August 10, 2025

ప్రైవేట్ స్కూళ్లలో పేద విద్యార్థుల అడ్మిషన్లకు నోటిఫికేషన్

image

AP: రాష్ట్రంలోని అన్ని ప్రైవేటు అన్-ఎయిడెడ్ స్కూళ్లలో పేద, బలహీన వర్గాల విద్యార్థులకోసం అదనపు నోటిఫికేషన్ విడుదలైంది. 2025-26 విద్యా సంవత్సరానికి 1వ తరగతిలో కేటాయించిన 25% సీట్లలో ఖాళీలను భర్తీ చేస్తారు. ఈనెల 12-20 వరకు ఆన్‌లైన్‌లో అప్లై చేయొచ్చు. AUG 21న అర్హత నిర్ధారణ, 25న లాటరీ ఫలితాలు, ఆగస్టు 31న అడ్మిషన్ల ఖరారు ఉంటుంది. అడ్రస్ కోసం ఆధార్/ఓటర్ ఐడీ, ఆదాయ ధృవీకరణకు రేషన్ కార్డు సరిపోతుంది.

News August 10, 2025

త్వరలోనే మహిళలకు రూ.18వేలు: ఎంపీ కేశినేని చిన్ని

image

AP: కూటమి ప్రభుత్వం ‘సూప‌ర్ సిక్స్’ ప‌థ‌కాలు ఒక్కొక్క‌టిగా విజ‌య‌వంతంగా అమ‌లు చేస్తోందని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్(చిన్ని) అన్నారు. ఆగ‌స్టు 15 నుంచి మ‌హిళ‌ల‌కు ఉచిత బ‌స్సు ప్ర‌యాణ ప‌థ‌కం ప్రారంభం కానుంద‌ని చెప్పారు. ఆ తర్వాత త్వ‌ర‌లోనే ‘స్త్రీ నిధి’ పథకం కింద మహిళలకు నెలకు రూ.1,500(ఏటా రూ.18,000) చొప్పున ఇవ్వనున్నట్లు తెలిపారు. అభివృద్ధి, సంక్షేమం 2 కళ్లుగా ప్రభుత్వ పాలన సాగుతోందన్నారు.

News August 10, 2025

21 సార్లు డకౌటయినా పర్లేదన్నారు: శాంసన్

image

భారత T20 కెప్టెన్ సూర్య, కోచ్ గంభీర్‌ గురించి శాంసన్ ఓ పాడ్‌కాస్ట్‌లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘వరుసగా 7 మ్యాచ్‌ల్లో ఛాన్స్ ఇస్తానని సూర్య చెప్పాడు. అయితే 2 మ్యాచ్‌ల్లో డకౌట్ అయ్యాను. నిరుత్సాహంలో ఉన్న నన్ను గంభీర్ భాయ్ చూసి ఏమైందని అడిగారు. ఛాన్స్ యూజ్ చేసుకోలేకపోతున్నానని చెప్పా. పర్లేదు.. 21 సార్లు డకౌట్ అయితే పక్కనపెడ్తానని అన్నారు. వారి ప్రోత్సాహమే నన్ను నడిపించింది’ అని వ్యాఖ్యానించారు.