News March 31, 2024
పటాన్‌చెరు: గృహిణి ఆత్మహత్య.. ఆరుగురిపై కేసు నమోదు

అత్తగారింట్లో వేధింపులు భరించలేక ఓ గృహిణి ఆత్మహత్య చేసుకుంది. అమీన్పూర్ సీఐ నాగరాజు తెలిపిన వివరాలు.. జంగంపేటకు చెందిన నసీమాబేగం(29)కు అమీన్పూర్ వాసి పాషాతో 2017లో వివాహమైంది. ఇటీవల అత్తారింటిలో మానసికంగా వేధింపులు ఎక్కువయ్యాయి. పెద్దల సమక్షంలో పంచాయితీ జరిగింది. అయినా ఫలితం లేకపోవడంతో నసీమా శుక్రవారం రాత్రి ఇంట్లో ఉరేసుకుంది. తల్లి కరీంబి ఫిర్యాదుతో ఆరుగురిపై కేసునమోదు చేసినట్లు సీఐ తెలిపారు.
Similar News
News April 23, 2025
మెదక్: ఇంటర్‌లో స్టేట్ ర్యాంక్

ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఎంపీసీ పరీక్షా ఫలితాల్లో రేగోడ్ మండల కేంద్రానికి చెందిన విద్యార్థి వెన్నెల ప్రణీత్ కుమార్ 470 మార్కులకు గాను 467 మార్కులతో స్టేట్ ర్యాంక్ సాధించాడు. ప్రణీత్ మాట్లాడుతూ.. తల్లిదండ్రులు ప్రోత్సాహం వల్లే మంచి మార్కులు సాధించానని పేర్కొన్నాడు. చిన్నప్పటి నుంచి విద్యలో ఉత్తమ ప్రతిభ పాటవాలు కనబరుస్తున్నాడు.
News April 23, 2025
239 వాహనాలను తీసుకెళ్లండి: మెదక్ ఎస్పీ

మెదక్ జిల్లా వ్యాప్తంగా పలు కేసులు, తనిఖీల్లో పట్టుబడిన 239 వాహనాల(టూ వీలర్స్ 224, ఆటోలు 9, ఫోర్ వీలర్స్ 6)ను జిల్లా పోలీసు కార్యలయం వద్ద భద్రపరిచారు. వాహనాల యజమానులు ఎవరైనా గుర్తుపట్టి సంబంధిత డాక్యుమెంట్లు తీసుకువచ్చి అధికారులకు చూపించి తీసుకెళ్లాలని ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి సూచించారు.
News April 23, 2025
మెదక్: ‘నేడు ఈ 7842651592 నంబరుకు చేయండి’

ఆర్టీసీ మెదక్ డిపోలో బుధవారం డయల్ యువర్ డీఎం కార్యక్రమం నిర్వహించనున్నట్లు మంగళవారం డిపో మేనేజర్ సురేఖ ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రయాణికులు ఉదయం 11 నుంచి 12 గంటల వరకు 7842651592 నంబరుకు ఫోన్ చేయవచ్చని తెలిపారు. ప్రయాణికులు తెలిపిన సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని అన్నారు.