News August 6, 2025
ఉత్తరకాశీ విపత్తు.. రంగంలోకి దిగిన IAF

ఉత్తరకాశీలో ధరాలీ, హర్సిల్ ప్రాంతాలను వరద <<17311127>>ప్రవాహం<<>> ముంచెత్తిన విషయం తెలిసిందే. సహాయక చర్యల కోసం ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ రంగంలోకి దిగింది. UP బరేలీ స్టేషన్‌లోని Mi-17s, ALH Mk-III చాపర్లను హై అలర్ట్‌లో ఉంచింది. ఆగ్రా నుంచి An-32s, C295s మిలిటరీ ఎయిర్‌క్రాఫ్ట్స్‌లో రిలీఫ్, రెస్క్యూ సామగ్రిని డెహ్రాడూన్‌కు పంపింది. వాతావరణం సహకరించనప్పటికీ జాయింట్ సివిల్-మిలిటరీ ఆపరేషన్ చేపట్టినట్లు IAF వెల్లడించింది.
Similar News
News August 7, 2025
జస్టిస్ వర్మ పిటిషన్ కొట్టేసిన సుప్రీంకోర్టు

జస్టిస్ యశ్వంత్ వర్మ రిట్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టేసింది. తన ఇంట్లో భారీగా డబ్బు లభ్యమైన ఘటనలో ఆరోపణలకు సంబంధించి త్రిసభ్య కమిటీ ఇచ్చిన అంతర్గత విచారణ నివేదికను కొట్టేయాలని కోరుతూ ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు చట్ట ప్రకారమే కమిటీ విచారణ చేపట్టిందని, పిటిషనర్ ప్రాథమిక హక్కులకు ఎలాంటి భంగం కలగలేదని పేర్కొంది. రిట్ పిటిషన్ కొట్టేస్తున్నట్లు తీర్పిచ్చింది.
News August 7, 2025
బిలియన్ల సంపద USకు రాబోతోంది: ట్రంప్

టారిఫ్స్ రూపంలో బిలియన్ల సంపద USకు రాబోతోందంటూ ట్రంప్ ట్రూత్ సోషల్‌లో పోస్ట్ చేశారు. ‘ప్రతీకార సుంకాలు ఇవాళ అర్ధరాత్రి(US టైమింగ్స్) నుంచి అమల్లోకి వస్తాయి. ఎన్నో ఏళ్ల పాటు USను దోచుకున్న దేశాల నుంచి బిలియన్ల డాలర్లు తిరిగి రావడం మొదలవుతుంది. దీన్ని ఆపాలని రాజకీయ ప్రత్యర్థులు చూస్తున్నారు. దేశం విఫలమవ్వాలని ప్రయత్నిస్తున్నారు’ అని పేర్కొన్నారు. ట్రంప్ విధానాలు USను ఏ స్థితికి చేరుస్తాయో చూడాలి.
News August 7, 2025
GOOD NEWS.. వారికి రూ.25,000

AP: చేనేత కార్మికుల అభివృద్ధి, సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి DBV స్వామి చెప్పారు. నేతన్న భరోసా కింద త్వరలోనే వారికి రూ.25,000 ఇస్తామని ప్రకటించారు. అందమైన వస్త్రాలు నేసి సమాజానికి నేతన్నలు నాగరికత నేర్పించారని ప్రశంసించారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా నేటి నుంచి చేతి మగ్గాలకు నెలకు 200 యూనిట్లు, మరమగ్గాలకు 500 యూనిట్ల విద్యుత్ ఉచితంగా అందించే పథకం ప్రారంభిస్తున్నామన్నారు.