News August 6, 2025
రేపు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

తెలంగాణలోని పలు జిల్లాల్లో రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. నల్గొండ, యాదాద్రి, రంగారెడ్డి, MBNR, నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ, గద్వాల జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు కురుస్తాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది. గంటకు 30-40కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. ఎల్లుండి కూడా పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని వెల్లడించింది.
Similar News
News August 7, 2025
ప్రజల డబ్బుకు మీ డబ్బా ఎందుకబ్బా!

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల <<17319958>>స్కీములకు<<>> పార్టీ నాయకుల పేర్లు, ఫొటోల వాడకం దేశంలో సాధారణమైంది. సొంత డబ్బు ప్రజలకు ఖర్చు చేస్తే ఆ నేత పేరు, ఫొటో పెట్టుకుంటే సరే కానీ ప్రజల డబ్బుతో అందించే పథకాలకు సొంత ప్రచారం సరికాదని ఎప్పట్నుంచో విమర్శలున్నాయి. CM/PM ఫొటో బదులు శాశ్వతంగా ఉండే ప్రభుత్వ చిహ్నం వాడటం ఉత్తమం. కానీ రాజకీయ ప్రయోజనాల కోసం ఏ పార్టీ ప్రభుత్వమూ ఇలా చేయదు. ఇంతకీ నేతల ఫొటో, పేరు ఉండాలా?ఏమంటారు?
News August 7, 2025
లోయలో పడ్డ CRPF వ్యాను.. ఇద్దరు జవాన్లు మృతి

జమ్మూకశ్మీర్‌లోని ఉదంపూర్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు CRPF జవాన్లు మరణించారు. కద్వా-బసంత్‌గఢ్ ప్రాంతంలో జవాన్లు ప్రయాణిస్తున్న వాహనం లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు చనిపోగా, 12 మందికి గాయాలయ్యాయి.
News August 7, 2025
బీసీ రిజర్వేషన్లు పెంచకుంటే బీజేపీ ఓటమి ఖాయం: పొన్నం

TG: బీసీ రిజర్వేషన్లు పెంచకుంటే వచ్చే ఎన్నికల్లో బీజేపీ ఓటమి ఖాయమని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఉత్తరాదిలోని చాలా రాష్ట్రాల్లో బీసీలు బీజేపీని తిరస్కరించారని తెలిపారు. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ చావుతప్పి కన్నులొట్ట.. అన్నట్లుగా గెలిచిందన్నారు. కిషన్ రెడ్డి వంటి వారి కుట్రలను సాగనివ్వబోమని, గాంధేయ పద్ధతిలో పోరాడి అనుకున్నది సాధిస్తామని స్పష్టం చేశారు.