News March 31, 2024

కొలిమిగుండ్లలో కార్మికుడు మృతి

image

పొట్టకూటి కోసం క్లీనర్ పని చేసుకోవడానికి లారీ వెంట వచ్చిన కార్మికుడు గుండె పోటుతో మృతి చెందిన సంఘటన కొలిమిగుండ్ల మండలం అల్ట్రాటెక్ సిమెంట్ పరిశ్రమ వద్ద శనివారం సాయంత్రం చోటుచేసుకుంది. ఎన్టీఆర్ జిల్లా బూడిదపాడు గ్రామానికి చెందిన గురక రామిరెడ్డి(48) ఉన్నట్టుండి కుప్పకూలి మృతి చెందారు. డ్రైవర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు PC నరసింహులు తెలిపారు.

Similar News

News February 4, 2026

కర్నూలు జిల్లాకు CM.. 1,200 మంది పోలీసులతో భద్రత

image

ఎమ్మిగనూరు మండలం కలుగొట్ల గ్రామానికి ఫిబ్రవరి 6న సీఎం చంద్రబాబు నాయుడు రానున్న నేపథ్యంలో భారీ భద్రత ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. 1,200 మంది పోలీసులతో పాటు స్పెషల్ పార్టీ, బాంబ్ స్క్వాడ్, మఫ్టీ బృందాలను రంగంలోకి దింపినట్లు పేర్కొన్నారు. హెలిప్యాడ్ నుంచి సభా ప్రాంగణం వరకు సీఎం వెళ్లే మార్గంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు.

News February 4, 2026

సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ

image

సీఎం చంద్రబాబు ఈ నెల 6న ఎమ్మిగనూరు మండలం కలుగొట్లలో పర్యటించనున్నారు. పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ నేపథ్యంలో హెలిప్యాడ్, ప్రజావేదిక, రైతు పంట పొలాల సందర్శన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి, ఎస్పీ విక్రాంత్ పాటిల్ బుధవారం పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే జయనాగేశ్వర రెడ్డి, జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్, కుడా ఛైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

News February 4, 2026

జాతీయ స్థాయి కరాటే పోటీలకు కర్నూలు జిల్లా క్రీడాకారులు

image

ఈనెల 7 నుంచి 8 వరకు విశాఖపట్నంలో జరగబోయే జాతీయ స్థాయి కరాటే పోటీలకు జిల్లా క్రీడాకారులు 30 మంది ఎంపికైనట్లు కరాటే సంఘం ప్రతినిధి మహావీర్ తెలిపారు. బుధవారం కర్నూలులో జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన క్రీడాకారులకు స్పోర్ట్స్ కిట్లను డాక్టర్ శంకర్ శర్మ అందజేశారు. కరాటే సాధన చేయడం ద్వారా క్రమశిక్షణ అలవడుతుందని అన్నారు. పతకాలు సాధిస్తే నజరానా అందజేస్తానని హామీ ఇచ్చారు.