News August 6, 2025
SEP 1 నుంచి నైపుణ్యం పోర్టల్: లోకేశ్

AP: యువత కోసం సెప్టెంబర్ 1న ‘నైపుణ్యం పోర్టల్’ని ప్రారంభించనున్నట్లు మంత్రి లోకేశ్ వెల్లడించారు. గ్రీన్ ఎనర్జీ కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ..’కంపెనీలను, ఉద్యోగాల కోసం చూస్తున్న యువతను ఒక్క చోట చేర్చనున్నాం. యువత నైపుణ్యం పెంచే దిశగానూ చర్యలు చేపట్టాం. AI వల్ల జాబ్స్ పోతాయని వార్తలొస్తున్నాయి. మార్పును అంగీకరించాలి. మన విద్యార్థులను సిద్ధం చేసుకోవాలి. అప్పుడే ఉద్యోగావకాశాలు వస్తాయి’ అని తెలిపారు.
Similar News
News January 16, 2026
శుభ సమయం (16-1-2026) శుక్రవారం

➤ తిథి: బహుళ త్రయోదశి రా.10.08 వరకు
➤ నక్షత్రం: మూల పూర్తిగా ఉంది
➤ శుభ సమయాలు: ఉ.6.35-8.47, ఉ.10.16-11.12, మ.1.14-మ.2.52, సా.4.44-సా.5.39
➤ రాహుకాలం: ఉ.10.30-మ.12.00
➤ యమగండం: మ.3.00-సా.4.30
➤ దుర్ముహూర్తం: ఉ.8.48-9.32, మ.12.29-1.13
➤ వర్జ్యం: మ.2.53-సా.4.39
News January 16, 2026
శుభ సమయం (16-1-2026) శుక్రవారం

➤ తిథి: బహుళ త్రయోదశి రా.10.08 వరకు
➤ నక్షత్రం: మూల పూర్తిగా ఉంది
➤ శుభ సమయాలు: ఉ.6.35-8.47, ఉ.10.16-11.12, మ.1.14-మ.2.52, సా.4.44-సా.5.39
➤ రాహుకాలం: ఉ.10.30-మ.12.00
➤ యమగండం: మ.3.00-సా.4.30
➤ దుర్ముహూర్తం: ఉ.8.48-9.32, మ.12.29-1.13
➤ వర్జ్యం: మ.2.53-సా.4.39
News January 16, 2026
HYD నగరానికి పెరుగుతున్న వలసలు.. కారణం ఇదేనా!

HYDకు వలసలు ఆగటం లేదు. నగర విస్తరణ వేగంగా కొనసాగుతున్న నేపథ్యంలో ప్రస్తుత పరిధిలో జనాభా ఇప్పటికే సుమారు 1.4 కోట్లకు చేరినట్లు అంచనాలు చెబుతున్నాయి. ఉపాధి, విద్య, వైద్య, ఐటీ రంగాల్లో అవకాశాలు, బతుకుదెరువు కోసం ప్రధాన కారణంగా నగరానికి నిరంతర వలస కొనసాగుతోంది. దీంతో ట్రాఫిక్, మౌలిక సదుపాయాలు, నివాస వసతులపై ఒత్తిడి పెరుగుతోంది.


