News March 31, 2024
అనంతలో డాక్టర్ సూసైడ్

అనంత నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో అనస్తీషియా వైద్యురాలు బలవన్మరణానికి పాల్పడ్డారు. రెండో పట్టణ సీఐ క్రాంతికుమార్ తెలిపిన వివరాల మేరకు అమరాపురం మండలానికి చెందిన శ్రీజ (22) సాయినగర్ లోని వసతి గృహంలో ఉంటూ ఓ ప్రైవేటు ఆసుపత్రిలో పనిచేస్తోంది.యువతి వసతి గృహంలోని తన గదిలో అపస్మారక స్థితిలోపడి ఉండటం చూసిన నిర్వాహకులు ప్రభుత్వ సర్వజనాసుపత్రికి తరలించగా మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
Similar News
News September 9, 2025
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన షెడ్యూల్ ఇదే

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అనంతపూరం పర్యటన షెడ్యూల్ ఖరారైంది. రేపు మధ్యాహ్నం 12:40 గంటలకు పుట్టపర్తి సత్య సాయిబాబా విమానాశ్రయానికి చేరుకుంటారు. అనంతరం అక్కడి నుంచి రోడ్డు మార్గంలో అనంతపురం చేరుకుంటారు. ఇంద్రప్రస్థ మైదానంలో జరిగే ‘సూపర్-6 సూపర్ హిట్’ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు.
News September 9, 2025
అనంత: టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సంగా తేజస్విని కారుపై రాళ్ల దాడి

అనంతపురంలో ‘సూపర్ సిక్స్-సూపర్ హిట్’ విజయోత్సవ భారీ బహిరంగ సభను ఘనంగా జరుపుకునేందుకు కూటమి నేతలు ఏర్పాటు చేసుకుంటున్నారు. అయితే తెలుగు మహిళ రాష్ట్ర అధికార ప్రతినిధి సంగా తేజస్విని కారుపై గుర్తుతెలియని వ్యక్తులు రాళ్లతో దాడి చేశారు. స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఆమె తెలిపారు. రాళ్ల దాడిలో దెబ్బతిన్న కారును పోలీసులు పరిశీలించారు.
News September 9, 2025
అనంత: ప్రజా సమస్యల పరిష్కార వేదికలో 401 అర్జీలు

అనంతపురం జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు జిల్లా వ్యాప్తంగా వచ్చిన సమస్యలపై అర్జీలు ఇచ్చారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడారు. ప్రజలు ఎంతో నమ్మకంతో తమ సమస్యలపై ఇచ్చిన అర్జీలను నాణ్యమైన రీతిలో పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 401 వినతి పత్రాలు వచ్చినట్లు తెలిపారు.