News August 6, 2025
NLG: వైద్య ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్

ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాల ద్వారా అన్ని రకాల వైద్య సేవలను అందించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు.
బుధవారం ఆమె మాన్యం చెల్క పట్టణ వైద్య ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఓపి, ఏఎన్‌సీ, మందుల స్టాక్ రిజిస్టర్లను తనిఖీ చేశారు. అలాగే టెస్టులు, ఇతర రిజిస్టర్లను తనిఖీ చేశారు. ఆయా చికిత్సలకు అందిస్తున్న వైద్య సేవల వివరాలను అడిగి తెలుసుకున్నారు.
Similar News
News August 9, 2025
NLG: న్యాయం చేయాలని పోలీసులకు రాఖీ కట్టి..!

రాఖీ పండుగ వేళ నల్గొండ జిల్లాలో ఆసక్తికర సంఘటన జరిగింది. తనకు న్యాయం చేయాలని కోరుతూ ఓ మహిళ నకిరేకల్ పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కి డ్యూటీలో ఉన్న సిబ్బందికి రాఖీ కట్టింది. తాటికల్లు గ్రామంలోని బాట పంచాయితీ వివాదంలో తన భర్త ముచ్చపోతుల వెంకన్నపై జంజిరాల వెంకటయ్య కుటుంబ సభ్యులు దాడి చేశారని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. ఈ ఫిర్యాదును త్వరగా పరిశీలించి తమకు న్యాయం చేయాలని ఆమె పోలీసులను కోరింది.
News August 9, 2025
NLG: ఫేక్ అటెండెన్స్ ప్రకంపనలు..!

జిల్లాలో గ్రామపంచాయతీ కార్యదర్శుల ఫేక్ అటెండెన్స్ వ్యవహారం ప్రకంపనలు రేపుతుంది. తప్పుడు పద్ధతిలో అటెండెన్స్ వేసిన 69 మంది కార్యదర్శులకు జిల్లా పంచాయతీ అధికారి నోటీసులు జారీ చేశారు. వాటికి కార్యదర్శులు కూడా సమాధానం ఇచ్చారు. ఆ నివేదిక అంతా కలెక్టర్‌కు సమర్పించనున్నారు. CCLA నిబంధనల ప్రకారం సస్పెండ్ చేయవచ్చని తెలుస్తుంది. ఇంక్రిమెంట్ కట్ చేసి ఇతర క్రిమినల్ చర్యలు తీసుకునేందుకు అవకాశం ఉంది.
News August 9, 2025
NLG: ఎంపీవోలు ఏం చేస్తున్నారు?!

పంచాయతీ కార్యదర్శులు రోజు ఫేస్ రికగ్నైజేషన్ ద్వారా హాజరు వేస్తారు. వారి హాజరును పరిశీలించాల్సింది ఆయా మండల కేంద్రాల్లో పనిచేస్తున్న ఎంపీఓలు. సదరు అధికారి రోజు రెండు, మూడు గ్రామాలు వెళ్లి పరిశీలించాలి. కానీ జిల్లాలో అధికారులు ఫేక్ అటెండెన్స్‌లు గుర్తించకపోవడం విశేషం. ఎవరూ పట్టించుకోకపోవడంతో కార్యదర్శులు ఫేక్ అటెండెన్స్‌కు పాల్పడినట్లు తెలుస్తుంది.