News August 6, 2025

ఇండియన్ క్రికెట్ ఎవరి కోసం ఆగదు: గంగూలీ

image

టెస్టులు, T20Iల నుంచి రిటైరైన స్టార్ క్రికెటర్లు వన్డేల్లోనైనా కొనసాగుతారా లేదా అన్న చర్చ నేపథ్యంలో మాజీ క్రికెటర్ గంగూలీ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘భారత క్రికెట్ ఎవరి కోసం ఆగదు. గవాస్కర్ తర్వాత సచిన్ వచ్చారు. ద్రవిడ్, సెహ్వాగ్, లక్ష్మణ్ వెళ్లాక కోహ్లీ ఎమర్జ్ అయ్యారు. ఇప్పుడు జైస్వాల్, పంత్, గిల్ నిలబడ్డారు. డొమెస్టిక్ క్రికెట్, IPL రూపంలో IND క్రికెట్‌కు పటిష్ఠ వ్యవస్థ ఉంది’ అని వ్యాఖ్యానించారు.

Similar News

News January 18, 2026

ఆ 88 గంటలు.. తీవ్రతను మాటల్లో వర్ణించలేం: రాజ్‌నాథ్

image

గతేడాది పాక్ ఉగ్ర శిబిరాలపై చేపట్టిన ఆపరేషన్ సిందూర్ 88 గంటలు కొనసాగిందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ చెప్పారు. అప్పుడు ఎదుర్కొన్న తీవ్రతను మాటల్లో వర్ణించలేమని అన్నారు. ఇలాంటి సమయాల్లో ప్రతి నిమిషం, నిర్ణయం చాలా కీలకమని తెలిపారు. ‘ప్రపంచంలో యుద్ధ రీతులు మారుతున్నాయి. కొత్త పద్ధతులు వస్తున్నాయి. ఇప్పుడు అవి సరిహద్దులకే పరిమితం కాదు’ అని నాగ్‌పూర్‌లో మందుగుండు సామగ్రి ప్లాంట్ ప్రారంభోత్సవంలో అన్నారు.

News January 18, 2026

‘నారీ నారీ నడుమ మురారి’ కలెక్షన్లు ఎంతంటే?

image

శర్వానంద్, సంయుక్త, సాక్షి వైద్య కాంబినేషన్లో తెరకెక్కిన ‘నారీ నారీ నడుమ మురారి’ విడుదలైన మూడు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో రూ.8.90 కోట్లు, ప్రపంచవ్యాప్తంగా రూ.13.10 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయని సినీ వర్గాలు తెలిపాయి. సంక్రాంతికి ఆఖరి సినిమాగా విడుదలై హిట్ టాక్ వచ్చినా థియేటర్ల కొరత ఉండటం కలెక్షన్లపై ప్రభావం చూపిస్తోంది. రేపటి నుంచి థియేటర్లు పెరిగే అవకాశం ఉందని సమాచారం. మీరు ఈ మూవీ చూశారా?

News January 18, 2026

జమ్మూకశ్మీర్‌లో కాల్పులు.. ఏడుగురు సైనికులకు గాయాలు

image

జమ్మూకశ్మీర్‌లోని కిష్త్వార్‌లో టెర్రరిస్టులు, భద్రతా బలగాల మధ్య కాల్పులు జరుగుతున్నాయి. ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఏడుగురు సైనికులు గాయపడినట్లు ఆర్మీ వర్గాలు తెలిపాయి. సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తుండగా ఛత్రూ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుందని వెల్లడించాయి. గాయపడ్డ వారిని ఆస్పత్రికి తరలించామని చెప్పాయి. ఆపరేషన్ కొనసాగుతోందని పేర్కొన్నాయి.