News August 6, 2025
ఆటో డ్రైవర్లకు సహాయం: CBN

AP: ‘స్త్రీశక్తి’ పథకం అమలుకు ముందే ఆటో డ్రైవర్లతో సమావేశం కావాలని సీఎం చంద్రబాబు మంత్రులను ఆదేశించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తే వారు నష్టపోతారన్న అభిప్రాయాలపై స్పందించారు. డ్రైవర్లతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకుని, తగిన సహాయం చేయాలన్నారు. ఫ్రీ బస్సు పథకం ప్రారంభోత్సవంలో మంత్రులు అందరూ పాల్గొనాలని CM సూచించారు. కాగా AUG 15 నుంచి రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు ఫ్రీ బస్సు పథకం అమలు కానుంది.
Similar News
News August 7, 2025
RRBలో 6,238 పోస్టులు.. ఇవాళే లాస్ట్

RRBలో 6,238 టెక్నీషియన్ పోస్టుల దరఖాస్తు గడువు నేటితో ముగియనుంది. గ్రేడ్-1 సిగ్నల్-183 పోస్టులు, టెక్నీషియన్ గ్రేడ్-3 కింద 6,055 ఉద్యోగాలను భర్తీ చేయనుంది. వయసు 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. జీతం పోస్టును బట్టి రూ.19,900 నుంచి రూ.29,200 వరకు ఉంటుంది. దరఖాస్తు ఫీజు రూ.250- రూ.500 వరకు ఉంది. రాత పరీక్ష, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక ఉంటుంది. <
News August 7, 2025
ఇన్‌స్టాగ్రామ్‌లో 3 కొత్త ఫీచర్స్

ఇన్‌స్టాగ్రామ్‌లో మూడు కొత్త ఫీచర్లు అందుబాటులోకి వచ్చాయి. పబ్లిక్‌గా ఉన్న రీల్స్, ఫీడ్ పోస్టులను రీపోస్ట్ చేసే ఆప్షన్‌ను తీసుకొచ్చారు. అలాగే యూజర్ తన ప్రజెంట్ లొకేషన్‌ను ఫ్రెండ్స్‌కు షేర్ చేసేలా ‘మ్యాప్’ ఫీచర్ తీసుకొచ్చారు. ఫ్రెండ్స్ లైక్ & కామెంట్ లేదా రీపోస్ట్ చేసిన రీల్స్ చూసేందుకు ‘ఫ్రెండ్స్’ అనే ట్యాబ్ తీసుకొచ్చారు. మూడు ఫీచర్లు క్రమంగా అందరికీ అందుబాటులోకి రానున్నాయి.
News August 7, 2025
BCCIకి ఊరట.. RTI నుంచి మినహాయింపు!

భారత క్రికెట్ బోర్డు(BCCI)ని ప్రభుత్వ పరిధిలోకి తెస్తూ నేషనల్ స్పోర్ట్స్ గవర్నెన్స్ బిల్లును కేంద్రం రూపొందించిన విషయం తెలిసిందే. అయితే సమాచార హక్కు చట్టం(RTI) నుంచి బోర్డుకు మినహాయింపు లభించినట్లు తెలిసింది. కేవలం ప్రభుత్వ నిధులతో నడిచే స్పోర్ట్స్ ఫెడరేషన్లకు మాత్రమే RTI వర్తించేలా బిల్లును సవరించినట్లు సమాచారం. దీని ప్రకారం ప్రభుత్వ నిధులపై ఆధారపడని BCCI RTI పరిధిలోకి రాదని తెలుస్తోంది.