News August 6, 2025
భారత్‌కు ట్రంప్ మరో బిగ్ షాక్

భారత్‌పై అక్కసుతో ఉన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అదనపు టారిఫ్ వేసి మరోసారి ఉక్రోషం వెళ్లగక్కారు. 25% అదనపు టారిఫ్‌లు విధిస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే ఆయన మన దేశంపై 25% సుంకాలు మోపారు. దీనికి అదనంగా సుంకాలు ఉంటాయని ఇటీవల ప్రకటించారు. ఈక్రమంలోనే మరో 25% విధిస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై సంతకం చేశారు. రష్యా నుంచి IND ఆయిల్ కొనుగోలు చేస్తోందనే కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వైట్‌హౌస్ తెలిపింది.
Similar News
News August 7, 2025
బీసీ రిజర్వేషన్లు.. నెక్స్ట్ ఏంటి?

TG: స్థానిక సంస్థల ఎన్నికల్లో BCలకు 42% రిజర్వేషన్లు కల్పించే అంశంపై నెక్స్ట్ ఏం జరుగుతుందన్న ఆసక్తి నెలకొంది. ఈ బిల్లును రాష్ట్రపతి ఆమోదించకపోవడంతో రాహుల్‌ను PMను చేసి రిజర్వేషన్లు సాధిస్తామని <<17320951>>CM రేవంత్<<>> నిన్న అన్నారు. దీంతో ప్రభుత్వపరంగా రిజర్వేషన్లు సాధ్యం కాకపోవచ్చనే అభిప్రాయాలు వెల్లడవుతున్నాయి. పార్టీ పరంగా రిజర్వేషన్లు కల్పించి ఎన్నికలకు వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.
News August 7, 2025
ఈ నెలాఖరున ఇండియాకు పుతిన్?

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటన ఖరారైనట్లు తెలుస్తోంది. ఈ నెలాఖరున ఆయన ఇండియాకు వస్తారని సమాచారం. ఈ పర్యటనలో ఇరు దేశాల మధ్య స్నేహసంబంధాలపై ప్రధాని మోదీతో చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ అక్కడి పత్రికలకు తెలిపినట్లు వార్తలు వస్తున్నాయి.
News August 7, 2025
‘అమ్మా.. ఇక సెలవు’

AP: వడ్డీ వ్యాపారుల దోపిడీకి ఓ నిండు ప్రాణం బలైంది. అనంతపురం(D) గుత్తి సెంట్రల్ బ్యాంకులో సబ్ స్టాఫ్‌గా పనిచేసే రవికుమార్ ఓ వడ్డీ వ్యాపారిని ₹50వేల లోన్ అడగగా ₹15K పట్టుకుని ₹35K ఇచ్చారు. దానికి వడ్డీనే ₹1.20 లక్షలు చెల్లించిన రవి ఇక తన వల్ల కాదని బ్యాంకు వాష్‌రూంలో ఉరేసుకున్నాడు. ‘నా టైం అయిపోయింది. అప్పులే నాకు శాపమయ్యాయి. అమ్మా.. ఇక సెలవు. హరితా (భార్య) నన్ను క్షమించు’ అని సూసైడ్ నోట్ రాశారు.