News March 31, 2024
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు
✓వివిధ శాఖలపై ఖమ్మం భద్రాద్రి జిల్లా కలెక్టర్లు సమీక్ష సమావేశం
✓ఖమ్మం నగరంలో బిఆర్ఎస్ పార్టీ సమావేశం
✓నేలకొండపల్లి మండలంలో ఎంపీ నామా పర్యటన
✓ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఈస్టర్ వేడుకలు
✓పాల్వంచ పెద్దమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు
✓భద్రాచలంలో ఎమ్మెల్యే వెంకటరావు పర్యటన
✓సత్తుపల్లి విద్యుత్ సరఫరాలో అంతరాయం
Similar News
News November 25, 2024
విద్యార్థులతో కలిసి భోజనం చేసిన జిల్లా కలెక్టర్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆదివారం పాల్వంచ పట్టణంలో పర్యటించారు. పట్టణంలోని ఎస్సి బాలికల పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి కలెక్టర్ మధ్యాహ్నం భోజనం చేశారు. అనంతరం విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. సమస్యలు ఏమైనా ఉంటే పాఠశాల సిబ్బందికి తెలపాలని కలెక్టర్ విద్యార్థినులను సూచించారు. ఈ కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.
News November 24, 2024
ఖమ్మం: సర్వే డేటా ఎంట్రీ కీలకం: భట్టి
సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే చివరి దశకు చేరుకున్నదని, సర్వే డేటా ఎంట్రీ చాలా కీలకమైందని, ఎలాంటి పొరపాట్లకు ఆస్కారం ఇవ్వొద్దని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. భట్టి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ పాల్గొన్నారు. ఖమ్మం జిల్లాలో 5,68,493 ఇండ్లను సర్వే కోసం గుర్తించామని, ఈనెల 23 నాటికి మొత్తం 4,78,868 ఇండ్ల సర్వే పూర్తయిందని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు.
News November 24, 2024
ఇల్లందు మాజీ ఎమ్మెల్యే మృతి.. నేపథ్యమిదే..
ఇల్లందు మాజీ ఎమ్మెల్యే ఊకే అబ్బయ్య(70)<<14693570>> తెల్లవారుజామున కన్నుమూశారు<<>>. ఆయన రెండు సార్లు (1983,94) సీపీఐ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2009లో టీడీపీ నుంచి పోటీ చేసి గెలిచారు. 2014 ఎన్నికల్లో టీడీపీ టిక్కెట్ లభించకపోవడంతో బీఆర్ఎస్ (అప్పటి టీఆర్ఎస్) నుంచి పోటీ చేసి ఓడారు. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్లో చేరినా టికెట్ దక్కకపోడవడంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు.