News August 6, 2025

‘ఇందిరమ్మ లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం తోడ్పాటు’

image

జిల్లా వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. అయితే లబ్దిదారులకు నిర్మాణ సామాగ్రి వ్యయం భారం కాకుండా ఉండేందుకు ప్రభుత్వం మండల నిర్మిత కేంద్రాలను తిరిగి ప్రారంభించింది. వీటి ద్వారా ఫ్లైయాష్ బ్రిక్స్‌ను సరసమైన ధరకే అందించనుంది. తద్వారా లబ్దిదారులకు ఆర్థిక భారం కాకుండా తోడ్పాటు నందించనుంది. కాగా ఇప్పటికే చింతకానిలో విఘ్నేశ్వర ఫ్లైయాష్ బ్రిక్ యూనిట్‌ కేంద్రం ప్రారంభమైంది.

Similar News

News August 7, 2025

చింతకాని: నానో యూరియాపై రైతులకు అవగాహన

image

చింతకాని మండలం చిన్నమండంలో నానో యూరియాపై మధిర వ్యవసాయ సంచాలకులు స్వర్ణ విజయచంద్ర రైతులకు అవగాహన కల్పించారు. సంప్రదాయ యూరియాతో నత్రజని వినియోగ సామర్థ్యం 30-40% మాత్రమేనని, నానో యూరియాతో అది 80-85% ఉండి మొక్కలకు తక్కువ మోతాదులో సరిపోతుందన్నారు. పర్యావరణ పరిరక్షణకు ఇది సహాయకమని, ఖర్చు తగ్గుతుందని, పురుగు మందు కలిపి కూడా పిచికారీకి వీలుంటుందని తెలిపారు. మానస, కళ్యాణి అధికారులు పాల్గొన్నారు.

News August 7, 2025

ఖమ్మం: అథ్లెటిక్స్‌లో రాణించిన విద్యార్థులకు అభినందన

image

ఈ నెల 3, 4న హనుమకొండలో జరిగిన రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో ఖమ్మం జిల్లాకు చెందిన క్రీడాకారులు 45 పతకాలు సాధించారు. వీరిలో 23 బంగారు, 11 రజత, 11 కాంస్య పతకాలు ఉన్నాయి. జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి బుధవారం విజేతలను అభినందించారు. కోచ్ ఎండి గౌస్‌ను ప్రత్యేకంగా సన్మానించారు. భవిష్యత్తులో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని, ఒలింపిక్స్‌లో కూడా పాల్గొని జిల్లా పేరు నిలబెట్టాలన్నారు

News August 7, 2025

ఆ ఇద్దరిపై PD యాక్టు కొనసాగింపు: ఖమ్మం సీపీ

image

ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న రౌడీ షీటర్ పేరెల్లి ప్రవీణ్, శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్న పగడాల విజయ్‌పై 12 నెలల పాటు పీడీ యాక్ట్ కొనసాగిస్తున్నట్లు ఖమ్మం సీపీ సునీల్ దత్ తెలిపారు. నిందితులు భూకబ్జాలు, బెదిరింపులకు పాల్పడుతూ డబ్బులు డిమాండ్ వంటి వరుస నేరాలతో ప్రజలను ఇబ్బందులకు గురి చేయడంతో చర్యలు తీసుకున్నామన్నారు. ఖానాపురం సీఐ భానుప్రసాద్ ఆధ్వర్యంలో నిందితులను చంచల్‌గూడ జైలుకు తరలించారు.