News August 6, 2025

GVMC స్థాయీ సంఘం సభ్యులు వీరే..

image

GVMC స్థాయీ సంఘం ఎన్నికల ఫలితాలను కమిషనర్ కేతన్ గార్గ్ ప్రకటించారు.
➣నీలిమ కొణతాల – 58 ➣గంకల కవిత – 57 ➣దాడి వెంకట రామేశ్వరరావు- 57
➣మొల్లి హేమలత 57 ➣సేనాపతి వసంత – 54 ➣ గేదెల లావణ్య – 53
➣మాదంశెట్టి చినతల్లి – 52 ➣రాపర్తి త్రివేణి వరప్రసాదరావు – 52
➣మొల్లి ముత్యాలు – 51 ➣పద్మా రెడ్డి 50 ఓట్లతో గెలిచారు.
వీరికి కమిషనర్ శుభాకాంక్షలు తెలిపారు.

Similar News

News August 7, 2025

సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ప్రారంభం కోసం ఎంపీ శ్రీభరత్ విజ్ఞప్తి

image

విశాఖ ఎంపీ శ్రీభరత్ కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ను గురువారం కలిశారు. విజయదశమి నాటికి సౌత్ కోస్ట్‌ రైల్వేజోన్ కార్యాలయాన్ని పూర్తి స్థాయిలో ప్రారంభించేలా గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. తిరుపతి ఎక్స్‌ప్రెస్, బెంగళూరు వందే భారత్ స్లీపర్, హైదరాబాద్ రాత్రి ఎక్స్‌ప్రెస్‌లను విశాఖ నుంచి ప్రారంభించాలని సూచించారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఇది మద్దతు ఇస్తుందన్నారు.

News August 7, 2025

ఈనెల నుంచి దీపం మూడో విడత సిలిండర్ల పంపిణీ: జేసీ

image

దీపం-2 పథకం కింద 3వ విడత గ్యాస్ సిలిండర్ల పంపిణీ ఈనెల 1వ తేదీ నంచి ప్రారంభమైందని జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ తెలిపారు. మొదటి విడత 2024 అక్టోబర్ 31 నుంచి 2025 మార్చి 31 వరకు 3,71,481 మందికి అందగా.. రెండో విడత 2025 ఏప్రిల్ 1 నుంచి 2025 జూలై 31 వరకు మొత్తం 3,58,380 మందికి అందజేశామని తెలిపారు. మొదటి విడత రూ.29,36,48,156, రెండో విడత రూ.29,95,63,633 నగదు లబ్ధిదారుల ఖాతాల్లో జమచేశామన్నారు.

News August 7, 2025

భూ సేకరణ వేగవంతం చేయండి: కలెక్టర్

image

మెట్రో రైల్, రైల్వేలైన్ విస్తరణ, గ్యాస్ పైప్‌లైన్ ప్రాజెక్టులకు భూ సేకరణ వేగవంతం చెయ్యాలని కలెక్టర్ హ‌రేంధిర ప్ర‌సాద్ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. గురువారం విశాఖ కలక్టరేట్‌లో సమీక్ష చేసి మార్గదర్శకాలు జారీచేశారు. ప్రాజెక్టులకు భూసేకరణ చేయడంతోపాటు, పరిహారం కూడా త్వరగా అందించాలని సూచించారు. విశాఖ మెట్రో రైలు ప్రాజెక్ట్ ఫేజ్-1లో మూడు కారిడార్లలో పనులకు సంబంధించి ప్రక్రియ వేగవంతం చేయాలన్నారు.