News August 6, 2025
హెలికాప్టర్ ప్రమాదంలో ‘ఘనా’ మంత్రులు మృతి

ఘనా దేశ రక్షణ మంత్రి, పర్యావరణశాఖ మంత్రి హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఆక్రా నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే వారి హెలికాప్టర్ రాడార్ నుంచి అదృశ్యమైందని అధికారులు పేర్కొన్నారు. మంత్రులు ఎడ్వర్డ్ ఒమేన్ బోమా, ఇబ్రహీం ముర్తాలా మహ్మద్ సహా 8 మంది ఈ ప్రమాదంలో చనిపోయారు. ‘మంత్రులు, జవాన్లు దేశ సేవలో ప్రాణాలు కోల్పోయారు’ అని ఘనా ప్రభుత్వం సంతాపం తెలియజేసింది.
Similar News
News August 10, 2025
‘సృష్టి’ కేసు.. రంగంలోకి ఈడీ

TG: ‘సృష్టి’ ఫెర్టిలిటీ సెంటర్ కేసులో ED రంగంలోకి దిగింది. ఇందులో మనీలాండరింగ్ కూడా జరిగిందని, కేసు వివరాలు ఇవ్వాలని పోలీసులకు లేఖ రాసింది. ప్రధాన నిందితురాలు డా.నమ్రత 8 రాష్ట్రాల్లో కార్యకలాపాలు సాగించి, చైల్డ్ ట్రాఫికింగ్‌కు పాల్పడినట్లు గుర్తించారు. 80 మంది పిల్లలను విక్రయించి సుమారు రూ.25 కోట్లు వసూలు చేసినట్లు అనుమానిస్తున్నారు. ఆ డబ్బును విదేశాల్లో పెట్టుబడులు పెట్టినట్లు భావిస్తున్నారు.
News August 10, 2025
భారీగా పడిపోయిన ధరలు

అమెరికా టారిఫ్‌ల ప్రభావం ఏటా రూ.20 వేల కోట్ల ఎగుమతులు చేసే APలో ఆక్వా రంగంపై పడింది. ట్రంప్ 50% సుంకం విధించడంతో ఉమ్మడి గోదావరి, కృష్ణా, GNT, ప్రకాశం, NLR జిల్లాల రైతుల భవిష్యత్తు ప్రశ్నార్థకమైంది. సుంకం పెంచుతున్నట్లు ఆయన చెప్పగానే ఎగుమతిదారులు రొయ్యల ధరలను భారీగా తగ్గించేశారు. 25 కౌంట్ KG రొయ్య ధర ₹565 నుంచి ₹430కు తగ్గింది. మిగతా వాటి ధరలూ KGపై ₹35-80 మేర తగ్గాయని రైతులు ఆవేదన చెందుతున్నారు.
News August 10, 2025
చికెన్ బ్రెస్ట్ VS లెగ్ పీస్.. ఏది మంచిదంటే?

*చికెన్ బ్రెస్ట్ పీస్: కొవ్వు, క్యాలరీలు తక్కువ, ప్రొటీన్ ఎక్కువ ఉంటుంది. ఇది బరువు తగ్గడం, మజిల్ బిల్డింగ్‌కి మంచిది.
*లెగ్ పీస్: మీట్ సాఫ్ట్‌గా, రుచిగా ఉంటుంది. కానీ కొవ్వు, క్యాలరీలు ఎక్కువ, ప్రొటీన్ కొంచం తక్కువ. దీంతో బరువు పెరిగే ప్రమాదం ఉంటుంది.
*మీ ఇష్టాన్ని బట్టి బరువు తగ్గాలి అనుకుంటే బ్రెస్ట్ పీస్, రుచిగా తినాలనుకుంటే లెగ్ పీస్ ఎంచుకోవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.