News August 7, 2025

‘గాఢ నిద్ర’ ఎందుకు అవసరమంటే?

image

మనిషికి గాఢ నిద్ర(డీప్ స్లీప్)ఎంతో అవసరమని వైద్యులు చెప్తున్నారు. ‘రోజూ 8 గంటలు పడుకున్నా గాఢ నిద్ర మాత్రం 60-100(20%) ని.లు మాత్రమే ఉంటుంది. ఆ సమయాన్ని పెంచుకునే ప్రయత్నం చేయాలి. కండరాలు, ఎముకలు, కణజాలాల మరమ్మతుకు గాఢ నిద్ర సహాయ పడుతుంది. ఇమ్యూనిటీ, జ్ఞాపకశక్తిని పెంచుతుంది. ఒత్తిడి తగ్గించుకోవడం, రోజూ ఒకే సమయానికి పడుకోవడంతో గాఢ నిద్ర సమయం పెరుగుతుంది’ అని వైద్యులు సూచిస్తున్నారు.

Similar News

News August 10, 2025

రేపటి నుంచి నులిపురుగుల నివారణ మాత్రలు పంపిణీ

image

TG: ఆగస్టు 11 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నులిపురుగుల నివారణ మాత్రలు పంపిణీ చేయనున్నట్లు మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. అంగన్‌వాడీ కేంద్రాలు, ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీల్లో మాత్రల పంపిణీ చేస్తామని, 1-19 సంవత్సరాలున్న వారంతా ఈ మాత్రలు వేసుకోవాలని సూచించారు. పేగుల్లో ఉండే నులిపురుగులను నివారించి, రక్తహీనతను అధిగమించేందుకు, రోగనిరోధక శక్తి పెంచేందుకు ఇవి దోహదపడతాయని మంత్రి పేర్కొన్నారు.

News August 10, 2025

కోహ్లీ, రోహిత్‌కు BCCI బిగ్ షాక్?

image

టీమ్ ఇండియా స్టార్ ప్లేయర్స్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలకు BCCI బిగ్ షాక్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. 2027 ODI WC ప్లాన్ నుంచి వీరిద్దరిని తప్పించనున్నట్లు సమాచారం. ఒకవేళ వీరు WC ఆడాలనుకుంటే విజయ్ హజారే ట్రోఫీలో పాల్గొనాలనే రూల్ విధిస్తున్నట్లు టాక్. వీరి స్థానంలో కుర్రాళ్లను ప్రోత్సహించాలని భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. కాగా కోహ్లీ, రోహిత్ వన్డేల్లోనే కొనసాగుతున్న విషయం తెలిసిందే.

News August 10, 2025

‘సృష్టి’ కేసు.. రంగంలోకి ఈడీ

image

TG: ‘సృష్టి’ ఫెర్టిలిటీ సెంటర్‌ కేసులో ED రంగంలోకి దిగింది. ఇందులో మనీలాండరింగ్ కూడా జరిగిందని, కేసు వివరాలు ఇవ్వాలని పోలీసులకు లేఖ రాసింది. ప్రధాన నిందితురాలు డా.నమ్రత 8 రాష్ట్రాల్లో కార్యకలాపాలు సాగించి, చైల్డ్ ట్రాఫికింగ్‌కు పాల్పడినట్లు గుర్తించారు. 80 మంది పిల్లలను విక్రయించి సుమారు రూ.25 కోట్లు వసూలు చేసినట్లు అనుమానిస్తున్నారు. ఆ డబ్బును విదేశాల్లో పెట్టుబడులు పెట్టినట్లు భావిస్తున్నారు.