News August 7, 2025

బాలకృష్ణ ఏడాదికి 4 చిత్రాలు చేస్తానన్నారు: నిర్మాత

image

హీరో బాలయ్య ఏడాదికి 4 సినిమాల్లో నటిస్తానని చెప్పినట్లు నిర్మాత ప్రసన్నకుమార్ వెల్లడించారు. సినీ కార్మికుల వేతనాల పంచాయితీపై కొందరు నిర్మాతలు బాలకృష్ణను కలిసిన విషయం తెలిసిందే. ‘నిర్మాతలు, కార్మికులు ఇద్దరూ బాగుండేలా చూసుకుంటానని చెప్పారు. సమస్యల పరిష్కారం కోసం తనవంతు కృషి చేస్తానన్నారు. వర్కింగ్ డేస్ తక్కువుంటే మంచిదన్నారు. అవసరం మేరకే కార్మికులను తీసుకోవాలని సూచించారు’ అని నిర్మాత తెలిపారు.

Similar News

News August 7, 2025

రేపు సెలవు ఇవ్వాలని డిమాండ్

image

TG: హైదరాబాద్ వ్యాప్తంగా అత్యంత భారీ వర్షం కురుస్తోంది. దీంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. రేపు కూడా భారీ వర్షాలు కురుస్తాయని IMD ఎల్లో అలర్ట్ జారీ చేసింది. దీంతో శుక్రవారం స్కూళ్లకు సెలవు ఇవ్వాలని విద్యార్థుల పేరెంట్స్ కోరుతున్నారు. వరలక్ష్మీ వ్రతం సందర్భంగా ప్రభుత్వం ఆప్షనల్ హాలిడే ప్రకటించినా, చాలా స్కూళ్లు సెలవు ఇవ్వలేదు. పబ్లిక్ హాలిడే ఇవ్వాలని పేరెంట్స్ డిమాండ్ చేస్తున్నారు. మీరేమంటారు?

News August 7, 2025

మాజీ IPS రఘువీర్‌రెడ్డిపై విచారణకు ఆదేశం

image

AP: 2024లో నంద్యాల SPగా పని చేసిన మాజీ IPS రఘువీర్‌రెడ్డిపై వచ్చిన అభియోగాలపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. నంద్యాల YCP అభ్యర్థి శిల్పా రవిని హీరో అల్లుఅర్జున్ కలిసిన సమయంలో భారీ ర్యాలీకి అనుమతించారని, అదే రోజు చంద్రబాబు పర్యటన ఉండగా వైసీపీ ర్యాలీకి పర్మిషన్ ఇచ్చారని ఆయనపై అభియోగాలున్నాయి. ఇతర ఆరోపణలపైనా విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఇంటెలిజెన్స్ ఐజీ రామకృష్ణను విచారణాధికారిగా CS నియమించారు.

News August 7, 2025

ప్రెగ్నెంట్ అని తెలిసినా కనికరించలేదు: రాధిక

image

తాను ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు సెట్‌లో ఎదురైన చేదు అనుభవాలను హీరోయిన్ రాధికా ఆప్టే పంచుకున్నారు. ‘నేను ప్రెగ్నెంట్‌గా ఉన్న సమయంలో ఓ బాలీవుడ్ సినిమాలో నటిస్తున్నా. ఈ విషయం తెలిసి ఆ చిత్ర నిర్మాత కసురుకున్నారు. షూటింగ్‌లో టైట్ దుస్తులు ధరించాల్సి వచ్చింది. డాక్టర్‌ను కలిసేందుకు కూడా ఒప్పుకోలేదు. నొప్పిగా ఉన్నా కూడా షూటింగ్ అలాగే కొనసాగించారు. అప్పుడు ఎంతో బాధపడ్డా’ అంటూ ఆమె చెప్పుకొచ్చారు.