News August 7, 2025
గుంటూరు: టీబీ శాఖలో ఖాళీలపై మెరిట్ జాబితా విడుదల

టీబీ శాఖలో NHM – NTEP ప్రాజెక్ట్ కింద ఖాళీగా ఉన్న ఐదు పోస్టులకు సంబంధించి ప్రొవిజనల్ మెరిట్ జాబితా విడుదలైంది. అభ్యర్థులు తమ అభ్యంతరాలను లిఖిత పూర్వకంగా తగిన ధ్రువ పత్రాలతో కలిపి ఆగస్టు 7 నుంచి 13వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు DM&HO కార్యాలయంలో సమర్పించవచ్చు. అనంతరం వచ్చిన అభ్యంతరాలు స్వీకరించబడవు. పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో https://guntur.ap.gov.in చూసుకోవచ్చని DMHO డా.విజయలక్ష్మి తెలిపారు.
Similar News
News September 1, 2025
సిరిపురంలో రికార్డు సృష్టించిన లడ్డూ వేలం

మేడికొండూరు మండలం, సిరిపురం గ్రామంలో నిర్వహించిన వినాయకుని లడ్డూ వేలంపాట రికార్డు సృష్టించింది. ఈ లడ్డూ రూ. 5,01,000లకు అమ్ముడై గ్రామ చరిత్రలోనే అత్యధిక ధర పలికింది. ప్రతి సంవత్సరం జరిగే వినాయక మహోత్సవాల్లో లడ్డూ వేలంపాట ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని నిర్వాహకులు తెలిపారు. ఈ ఏడాది సిరిపురం గ్రామానికి చెందిన కడియాల పరమేశ్వరరావు (అశోక్) భక్తిశ్రద్ధలతో లడ్డూను దక్కించుకున్నారు.
News August 31, 2025
GNT: ‘3న ఉమెన్స్ కాలేజ్లో గెస్ట్ ఫ్యాకల్టీ ఎంపికలు’

గుంటూరు ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో సెప్టెంబర్ 3న ఉదయం 10 గంటల నుంచి గెస్ట్ ఫ్యాకల్టీ ఎంపికల కోసం ఇంటర్వ్యూ జరగనుంది. హోమ్ సైన్సెస్‌లో 50% మార్కులతో పాటు నెట్, సెట్, పీహెచ్డీ అనుభవం కలిగిన వారు ఇంటర్వూలకు అర్హులని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వి.ఆర్ జ్యోత్స్నకుమారి తెలిపారు. ఈ అవకాశాన్ని ఆసక్తి కలిగిన అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.
News August 31, 2025
గుంటూరులో కేజీ చికెన్ ధర ఎంతంటే?

గుంటూరులో ఆదివారం నాటి చికెన్ ధరలు ఇలా ఉన్నాయి. చికెన్ స్కిన్ లెస్ కేజీ రూ.200, చికెన్ విత్ స్కిన్ కేజీ రూ.180గా విక్రయిస్తున్నారు. కొన్ని ప్రాంతాలు, ఆ ప్రాంతాల్లో చికెన్‌కి ఉన్న డిమాండ్‌ని బట్టి ధరల్లో రూ. 20 నుంచి రూ.30 వ్యత్యాసం కూడా కనిపిస్తుంది. మరి ఈరోజు మీ ప్రాంతంలో చికెన్ ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేసేయండి.