News August 7, 2025
ఎయిర్‌పోర్ట్ పరిసరాల్లో శుభ్రతకు చర్యలు తీసుకోండి: కలెక్టర్

ఎయిర్‌పోర్ట్ పరిసరాల్లో అపరిశుభ్రత ఉండకూడదని, డ్రెయిన్లు సాఫీగా పని చేసేలా చూడాలని విశాఖ కలెక్టర్ హరేంధిర ప్రసాద్ సూచించారు. ట్రక్ పార్కింగ్ సమీపంలో ఆహారపు ప్యాకెట్లు వేయకుండా డ్రైవర్లకు అవగాహన కల్పించాలని, పక్షుల ఆకర్షణ నివారించాలన్నారు. పూడిక, చెత్తను తొలగించాలన్నారు. ఎయిర్‌పోర్ట్ డైరెక్టర్ పురషోత్తం పర్యావరణంపై గమనించిన సమస్యలను వివరించారు. అధికారుల సమన్వయంతో తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
Similar News
News August 7, 2025
గ్యాస్ సిలిండర్ పేలుడు ప్రమాద బాధితులు వీరే..

విశాఖ ఫిషింగ్ హార్బర్ సమీపంలో వెల్డింగ్ దుకాణంలో గ్యాస్ సిలిండర్ పేలుడు ప్రమాదంలో నలుగురు తీవ్రంగా గాయపడి కేజీహెచ్ క్యాజువాలిటీలో చికిత్స పొందుతున్నారు. వారి వివరాలు: బుక్క వీధి ఫిషింగ్ హార్బర్ ఏరియాకి చెందిన చింతకాయల ముత్యాలు (27), మిథిలాపురి వుడా కాలనీకి చెందిన ఎర్ర ఎల్లాజీ (45), రాజీవ్ నగర్‌కి చెందిన టి.సన్యాసిరావు(46), చంగల్ రావు పేటకు చెందిన ఇప్పిలి రంగారావు (53).
News August 7, 2025
సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ప్రారంభం కోసం ఎంపీ శ్రీభరత్ విజ్ఞప్తి

విశాఖ ఎంపీ శ్రీభరత్ కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ను గురువారం కలిశారు. విజయదశమి నాటికి సౌత్ కోస్ట్ రైల్వేజోన్ కార్యాలయాన్ని పూర్తి స్థాయిలో ప్రారంభించేలా గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. తిరుపతి ఎక్స్‌ప్రెస్, బెంగళూరు వందే భారత్ స్లీపర్, హైదరాబాద్ రాత్రి ఎక్స్‌ప్రెస్‌లను విశాఖ నుంచి ప్రారంభించాలని సూచించారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఇది మద్దతు ఇస్తుందన్నారు.
News August 7, 2025
ఈనెల నుంచి దీపం మూడో విడత సిలిండర్ల పంపిణీ: జేసీ

దీపం-2 పథకం కింద 3వ విడత గ్యాస్ సిలిండర్ల పంపిణీ ఈనెల 1వ తేదీ నంచి ప్రారంభమైందని జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ తెలిపారు. మొదటి విడత 2024 అక్టోబర్ 31 నుంచి 2025 మార్చి 31 వరకు 3,71,481 మందికి అందగా.. రెండో విడత 2025 ఏప్రిల్ 1 నుంచి 2025 జూలై 31 వరకు మొత్తం 3,58,380 మందికి అందజేశామని తెలిపారు. మొదటి విడత రూ.29,36,48,156, రెండో విడత రూ.29,95,63,633 నగదు లబ్ధిదారుల ఖాతాల్లో జమచేశామన్నారు.