News August 7, 2025
తాజా సినిమా ముచ్చట్లు

☛ ‘వార్-2’ సినిమాకు U/A 16+ సర్టిఫికెట్ ఇచ్చిన సెన్సార్ బోర్డు.. మూవీ రన్ టైమ్ 3.02 గంటలు
☛ రేపు నేచురల్ స్టార్ నాని ‘ది ప్యారడైజ్’ సినిమా ఫస్ట్ లుక్ విడుదల
☛ మంచు మనోజ్ కొత్త సినిమా టైటిల్ ‘డేవిడ్ రెడ్డి’.. హనుమ రెడ్డి యక్కంటి దర్శకుడు
☛ కన్నడ డైరెక్టర్ A.P.అర్జున్‌తో రవితేజ సినిమా?
☛ కిరణ్ అబ్బవరం ‘K-RAMP’ మూవీ నుంచి ఈ నెల 9న ‘ఓనమ్’ సాంగ్ రిలీజ్
Similar News
News August 9, 2025
భారత్‌పై ట్రంప్ విధించిన 50% టారిఫ్స్ వల్ల ఏం జరుగుతుంది?

ఈ టారిఫ్స్‌ను భారత్ భరించదు. మన దేశ ఉత్పత్తులను దిగుమతి చేసుకునే USలోని వ్యాపారులు అధిక పన్నులు చెల్లించాల్సి వస్తుంది. ఆ భారాన్ని పూడ్చుకోడానికి వస్తువుల ధరలు పెంచుతారు. ఫలితంగా వాటిని కొనే అమెరికా కస్టమర్లే ఆ భారం భరించాల్సి ఉంటుంది. అయితే మన కంపెనీల ఎగుమతులపై ప్రభావం పడకుండా ప్రభుత్వం ఇతర మార్కెట్లను అన్వేషిస్తోంది. నష్టాన్ని సబ్సిడైజ్ చేసే అవకాశం లేకపోలేదు.
News August 9, 2025
అది తప్పుడు ప్రచారం: చిరంజీవి

సినీ కార్మికుల డిమాండ్ల పరిష్కారంపై తాను హామీ ఇచ్చినట్లు జరుగుతున్న ప్రచారాన్ని మెగాస్టార్ చిరంజీవి ఖండించారు. ‘కార్మికులకు 30% వేతనం పెంపు తదితర డిమాండ్లు అమలయ్యేలా చూస్తానని, షూటింగ్ ప్రారంభిస్తానని నేను హామీ ఇచ్చినట్లు కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. నేను ఎవరినీ కలవలేదు. ఇది ఇండస్ట్రీ సమస్య. వ్యక్తిగతంగా ఎలాంటి హామీ ఇవ్వలేను. ఫిల్మ్ ఛాంబర్‌దే తుది నిర్ణయం’ అని పేర్కొన్నారు.
News August 9, 2025
అరంగేట్రంలోనే అరుదైన రికార్డు

జింబాబ్వేతో రెండో టెస్టులో న్యూజిలాండ్ బౌలర్ జాకరీ ఫౌల్కెస్ రికార్డు సృష్టించారు. అరంగేట్ర మ్యాచ్‌లో అత్యుత్తమ ప్రదర్శన(9/75) చేసిన బౌలర్‌గా నిలిచారు. దీంతో విలియమ్ ఓరూర్కీ రికార్డు(9/93)ను అధిగమించారు. ఓవరాల్‌గా భారత మాజీ బౌలర్ నరేంద్ర హీర్వానీ 16/136తో టాప్ ప్లేస్‌లో ఉన్నారు. కాగా ఈ మ్యాచ్‌లో ఇన్నింగ్స్&359 రన్స్ తేడాతో జింబాబ్వేను ఓడించిన NZ టెస్టుల్లో మూడో అతిపెద్ద విజయాన్ని నమోదు చేసింది.