News August 7, 2025
నేడు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

TG: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఇవాళ భారీ వర్షాలు కురుస్తాయని HYD వాతావరణ కేంద్రం అంచనా వేసింది. నల్గొండ, జనగాం, సిద్దిపేట, భువనగిరి, వికారాబాద్, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో(30-40km/h) కూడిన భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది.
Similar News
News August 10, 2025
మా డిమాండ్ ఇదే.. మద్దతు తెలపండి: రాహుల్

ఓట్ చోరీ జరిగిందన్న LOP రాహుల్ గాంధీ <<17330640>>వ్యాఖ్యలు<<>> వివాదాస్పదమైన విషయం తెలిసిందే. అయితే రాహుల్ ఈ విషయంలో వెనక్కితగ్గడం లేదు. ఎన్నికలు న్యాయంగా జరగాలంటే క్లీన్ ఓటర్ లిస్ట్ అత్యవసరమన్నారు. ‘పారదర్శకంగా వ్యవహరిస్తూ డిజిటల్ ఓటర్ లిస్ట్ రిలీజ్ చేయాలని ECని డిమాండ్ చేస్తున్నాం. http://votechori.in/ecdemandను విజిట్ చేసి, లేదా 9650003420కు మిస్డ్ కాల్ ఇచ్చి మాకు మద్దతు తెలపండి’ అని ప్రజలకు పిలుపునిచ్చారు.
News August 10, 2025
APL: 17 బంతుల్లోనే హాఫ్ సెంచరీ

ఆంధ్ర ప్రీమియర్ లీగ్‌లో విజయవాడ సన్‌షైనర్స్ ప్లేయర్ జహీర్ అబ్బాస్ సంచలనం నమోదు చేశారు. కాకినాడ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచులో 17 బంతుల్లోనే ఫిఫ్టీ బాదారు. 19 బంతుల్లో 4 సిక్సర్లు, 7 ఫోర్లతో 57 రన్స్ చేశారు. ఈ సీజన్‌లో ఇదే ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ. జహీర్, తేజ(46*) విధ్వంసంతో విజయవాడ 195 పరుగులు చేసింది. కాకినాడ పరుగుల వేటలో పడింది.
News August 10, 2025
చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని పాతరేస్తున్నారు: జగన్

AP: CM చంద్రబాబు అరాచకాలకు పాల్పడుతూ ప్రజాస్వామ్యాన్ని పాతరేస్తున్నారని YCP అధినేత జగన్ ఫైరయ్యారు. ‘పులివెందుల, ఒంటిమిట్ట ZPTC ఉప ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి TDP గూండాలు, కొంతమంది అధికారులు, పోలీసులు మా పార్టీ శ్రేణులపై దాడులు చేస్తున్నారు. YCP ఓటర్లను ఇబ్బందిపెట్టేందుకు 4KM దూరంలో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. దేవుడు, ప్రజలపై నమ్మకం ఉంది. ధర్మమే గెలుస్తుంది’ అని ట్వీట్ చేశారు.