News August 7, 2025

HYD: తెలుగు విశ్వవిద్యాలయం చరిత్ర ఇదే!

image

దేశంలో భాషా ప్రాతిపదిక మీద 1985 DEC 2న HYDలో తెలుగు యూనివర్సిటీ ఆవిర్భవించింది. 1998లో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంగా, 2025 మార్చి 18న సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయంగా దీనికి 2సార్లు నామకరణం చేశారు. AP, ఇతర రాష్ట్రాలు, దేశాల్లో తెలుగు భాష అభివృద్ధే ధ్యేయంగా ప్రారంభమైంది. ఇందులో 1985 మార్చి 13న తూమాటి దొణప్ప ప్రత్యేకాధికారిగా పదవీ బాధ్యతలు చేపట్టారు.

Similar News

News August 10, 2025

HYD: సీఎం రేవంత్ రెడ్డితో యువకుల సెల్ఫీలు

image

సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం అమీర్పేట డివిజన్‌లో ఆకస్మికంగా పర్యటించిన విషయం తెలిసిందే. వరద ప్రభావిత ప్రాంతాలను రేవంత్ రెడ్డి అధికారులతో కలిసి పరిశీలించారు. అయితే సీఎం రేవంత్ రెడ్డిని చూడగానే పలువురు యువకులు సెల్ఫీల కోసం పోటీపడ్డారు. రేవంత్ రెడ్డి వారందరినీ కలిసి సెల్ఫీలు ఇచ్చారు. దీంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయింది.

News August 10, 2025

BREAKING: KPHBలో కరెంట్ షాక్‌తో బాలుడి మృతి

image

KPHB PS పరిధి వసంత్‌నగర్‌లో ఆదివారం విషాదం నెలకొంది. పోలీసుల వివరాలు.. 14 ఏళ్ల బాలుడు విద్యుత్‌ షాక్‌కు గురై మృతిచెందాడు. ఇంటి ప్రాంగణంలో బంధువుతో కలిసి విజయ్ కార్తీక్ షటిల్‌ ఆడుతుండగా కాక్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ మీద పడింది. దాన్ని తీసేందుకు ప్రయత్నించగా కరెంట్‌ షాక్‌ తగిలింది. ఆసుపత్రికి తరలించగా అప్పటికే బాలుడు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. KPHB పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News August 10, 2025

కూకట్‌పల్లి: లవర్‌తో మాట్లాడుతున్నాడని బ్లేడ్‌తో దాడి

image

కూకట్‌‌పల్లి PS పరిధిలో యువకుడిపై బ్లేడుతో దాడి చేసిన ఘటన ఆదివారం వెలుగుచూసింది. జనతానగర్‌లో వర్ధన్ (33) వెల్డింగ్ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. వర్ధన్ తన లవర్‌తో మాట్లాడుతున్నాడని కోపం పెంచుకున్న భాస్కర్ బ్లేడ్‌తో అతడి మెడపైన దాడి చేశాడు. ఈ దాడిలో వర్ధన్‌కు తీవ్ర రక్తస్రావం కావడంతో గమనించిన స్థానికులు ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొన్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.