News March 31, 2024

మాల్దీవులు, చైనాకు మధ్య బలమైన బంధానికి కారణాలు ఇవేనా?

image

మాల్దీవులకు చైనా సైనిక సహాయాన్ని ఫ్రీగా అందిస్తోంది. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని అమలు చేస్తూ ఆర్థిక వ్యవస్థకు ప్రయోజనాలు కలిగేలా చర్యలు తీసుకొంటోంది. అంబులెన్స్‌‌లు, సివిల్ వాహనాలు గిఫ్ట్‌గా ఇస్తోంది. తాగునీటిని పంపిస్తోంది. మాలేలో రోడ్లను ఫ్రీగా నిర్మించేందుకు అంగీకరించింది. వ్యవసాయ రంగ వృద్ధికి సాయపడే పలు ఒప్పందాలు చేసుకుంది. ఇవన్నీ ఇరు దేశాల బంధాన్ని బలపరుస్తున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.

Similar News

News March 20, 2026

రూ.5.62 లక్షల కోట్లకు చేరువగా రుణభారం!

image

తెలంగాణలో అప్పులు గణనీయంగా పెరుగుతున్నాయి. 2026-27 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంపై రుణభారం రూ.5.62 లక్షల కోట్లకు చేరుకుంటుందని ప్రభుత్వం అంచనా వేసింది. 2025-26లో రుణభారం రూ.5.03 లక్షల కోట్లు కాగా ఇప్పుడు అదనంగా మరో రూ.59,000 కోట్లు పెరగనుంది. రుణభారం ఈ విధంగా పెరగడం వల్ల, ఈ ఏడాది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నుంచి రుణాలు సేకరించే విషయంలో ప్రభుత్వానికి ఆటంకాలు తప్పేలా లేవు.

News March 20, 2026

రేపు, ఎల్లుండి వర్షాలు: APSDMA

image

బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనంతో పాటు కర్ణాటక, తమిళనాడు మీదుగా ద్రోణి విస్తరించి ఉందని APSDMA తెలిపింది. దీని ప్రభావంతో శనివారం, ఆదివారాల్లో వర్షాలు కురుస్తాయని పేర్కొంది. రేపు అన్ని జిల్లాల్లో పిడుగులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఎల్లుండి విజయనగరం, విశాఖ, అనకాపల్లి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో వానలు పడతాయని తెలిపిింది.

News March 20, 2026

మేకలకు ‘వైడ్ యాంగిల్’.. గద్దలకు ‘బైనాక్యులర్’ విజన్!

image

జీవులన్నింటిలో మేకలు, గద్దలు విభిన్న దృష్టి సామర్థ్యాలను కలిగి ఉన్నాయి. మేకలు తమ దీర్ఘచతురస్రాకార కనుపాపల ద్వారా తల తిప్పకుండానే 320 డిగ్రీల వరకు చూడగలవు. గడ్డి మేస్తున్నప్పుడు కూడా శత్రువులను పసిగట్టేలా ప్రకృతి వీటికి ఈ ‘వైడ్ యాంగిల్’ చూపును ఇచ్చింది. అలాగే గద్దలు కిలోమీటర్ల ఎత్తు నుంచి కూడా నేలపై చిన్న ఆహారాన్ని స్పష్టంగా చూస్తాయి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు ‘వంద రోజుల్లో-వంద వింతలు’లో.