News August 7, 2025

ఇవాళ 3 పథకాలు ప్రారంభం

image

AP: చేనేత కార్మికుల కోసం 3 పథకాలను ప్రభుత్వం ఇవాళ ప్రారంభించనుంది. కార్మికులకు 200 యూనిట్లు, మరమగ్గాలకు 500 యూనిట్ల ఫ్రీ కరెంట్ అందించే స్కీంను జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా మంగళగిరిలో CM చంద్రబాబు ప్రారంభిస్తారు. చేనేత దుస్తులపై 5% GST మినహాయింపు, చేనేతలకు హెల్త్ ఇన్సూరెన్స్‌పై CM ప్రకటించనున్నారు. ప్రభుత్వం సుమారు 2.5 లక్షల చేనేత కార్మికుల జీవనోపాధిని బలోపేతం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది.

Similar News

News August 10, 2025

బంగారం కాదు.. ఇవే విలువైనవి: వారెన్ బఫెట్

image

కింగ్ ఆఫ్ స్టాక్స్‌గా పేరుగాంచిన వారెన్ బఫెట్ దృష్టిలో బంగారానికి విలువలేదు. దాదాపు రూ.12 లక్షల కోట్ల(140 బి.డాలర్స్) ఆస్తులున్న ఆయన ఒక్క రూపాయీ బంగారంపై పెట్టలేదు. 2011లో ఓ గోల్డ్ మైనింగ్ కంపెనీలో పెట్టుబడి పెట్టినా 6 నెలల్లోనే వెనక్కి తీసుకున్నారు. బంగారమా, భూమా? అంటే.. ఆయన భూమే కొనమంటారు. గోల్డ్ కంటే భూమి, వ్యాపారంపై ఇన్వెస్ట్ చేయడం మంచిదంటారు. అవే దీర్ఘకాలిక ప్రయోజనాలు అందిస్తాయని చెప్తారు.

News August 10, 2025

ఉద్యోగి రిజైన్.. HRకు నెటిజన్స్ చివాట్లు!

image

ఓ ఉద్యోగి ఫస్ట్ శాలరీ అందిన 5ని.కే రిజైన్ చేశారు. ఇంకేముంది సదరు ఉద్యోగిని ఆ HR తప్పుబట్టారు. ‘వారాల కొద్దీ ట్రైనింగ్, గంటల కొద్దీ పేపర్ వర్క్ చేశాం. ఇంత సెల్ఫిష్‌గా రిజైన్ చేస్తారా? ఎందుకు జాయిన్ అవ్వాలి? ఇబ్బందుంటే మాట్లాడాలి, సహాయం కోరాలి’ అని పోస్ట్ చేశారు. నెటిజన్స్ ఆ ఉద్యోగినే సమర్థించారు. ‘ప్రొబేషన్‌లో మీకు నచ్చకపోతే తీసేస్తారు, లేఆఫ్స్ అంటూ తీసేస్తున్నారుగా’ అని ప్రశ్నలు గుప్పిస్తున్నారు.

News August 10, 2025

ఆగస్టు 10: చరిత్రలో ఈరోజు

image

1894: మాజీ రాష్ట్రపతి వి.వి.గిరి(ఫొటోలో) జననం
1914: ‘మా తెలుగు తల్లికి మల్లె పూదండ’ రచయిత శంకరంబాడి సుందరాచారి జననం
1945: అమెరికా దేశ రాకెట్ల పితామహుడు రాబర్ట్ గొడ్డార్డ్ మరణం
● నేడు ప్రపంచ జీవ ఇంధన(బయో ఫ్యూయల్) దినోత్సవం
● ప్రపంచ సింహాల దినోత్సవం