News August 7, 2025

వరంగల్: రైలు కిందపడి వ్యక్తి ఆత్మహత్య

image

వరంగల్ నగరంలోని హంటర్ రోడ్ వద్ద గురువారం తెల్లవారుజామున 4 గంటలకు హైదరాబాద్ వెళుతున్న గోదావరి ఎక్స్‌ప్రెస్ కింద పడి గుర్తు తెలియని వ్యక్తి (38) ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు గమనించి సమాచారం ఇవ్వడంతో వరంగల్ రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని వరంగల్ ఎంజీఎం మార్చురీకి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News August 11, 2025

వైసీపీ నేత చెవిరెడ్డి బెయిల్ పిటిషన్‌పై రేపు జరగనున్న వాదనలు

image

లిక్కర్ కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న వైసీపీ నేత, మాజీ MLA చెవిరెడ్డి భాస్కరరెడ్డి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై సోమవారం వాదనలు జరగనున్నాయి. విజయవాడ ACB కోర్టులో ఈ పిటిషన్‌పై న్యాయాధికారి రేపు విచారించనున్నారు. అటు ఇదే కేసులో గుంటూరు జైలులో రిమాండ్‌లో ఉన్న నవీన్ కృష్ణ, కుమార్ యాదవ్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లపై సైతం రేపు వాదనలు జరగనున్నట్లు సమాచారం వెలువడింది.

News August 11, 2025

ఎన్టీఆర్: రాబోయే 3 గంటల్లో వర్షం

image

రానున్న మూడు గంటల్లో ఎన్టీఆర్ జిల్లాలో అక్కడక్కడ గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణ సంస్థ ( APSDMA) హెచ్చరిక జారీ చేసింది. ఈ మేరకు తమ అధికారిక X ఖాతాలో పోస్ట్ చేసింది. జిల్లా వాసులంతా అప్రమత్తంగా ఉండాలని, శిధిలావస్థలో ఉన్న భవనాల వద్ద ఉండొద్దని సూచించారు.

News August 11, 2025

భారత డ్యామ్‌ను మిస్సైళ్లతో పేల్చేస్తాం: పాక్ ఆర్మీ చీఫ్

image

US గడ్డపై నుంచి పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ భారత్‌కు హెచ్చరికలు చేశారు. ‘భవిష్యత్తులో తమ దేశానికి భారత్‌తో ముప్పు ఉందని తెలిస్తే సగం ప్రపంచాన్ని మాతో పాటు ధ్వంసం చేస్తాం. సింధూ నదిపై భారత్ డ్యామ్ కట్టే వరకు ఆగి 10 మిస్సైళ్లతో పేల్చేస్తాం. సింధూ నది భారతీయుల కుటుంబ ఆస్తి కాదు. మాదీ అణ్వాయుధ దేశమనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. మా వద్ద మిస్సైళ్లకు కొదవ లేదు’ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.