News August 7, 2025
ఎల్బీనగర్: BJPని TGలో నామరూపాలు లేకుండా చేస్తాం: కోట్ల

కాంగ్రెస్ దొంగ ధర్నాలతో బీసీ రిజర్వేషన్లు ఇవ్వకుండా నాటకం ఆడుతుందని, రిజర్వేషన్లు ఇస్తే తీసుకుంటాం లేకుంటే గుంజుకుంటామని గురువారం ఎల్బీనగర్‌లో తెలంగాణ బీసీ పొలిటికల్ జేఏసీ నాయకుడు కోట్ల వాసుదేవ్ విమర్శించారు. BJP కూడా ముస్లింల పేరు చెప్పి రిజర్వేషన్లు ఇవ్వకుండా పబ్బం గడుపుతోందని మండిపడ్డారు. రిజర్వేషన్లు ఇవ్వకుంటే BJPని తెలంగాణలో నామరూపాలు లేకుండా చేస్తామని హెచ్చరించారు.
Similar News
News August 11, 2025
భద్రాద్రి జిల్లాలో నేటి ముఖ్యాంశాలు..!

✓రేపు కలెక్టరేట్లో ప్రజావాణి.. ఐటీడీఏలో గిరిజన దర్బార్
✓జిల్లా వ్యాప్తంగా శ్రావణమాసం బోనాలు
✓టేకులపల్లి పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన డీఎస్పీ
✓బూర్గంపాడు: చింతకుంటలో తాగునీటి సమస్య
✓ఆళ్లపల్లిలో యువకుడి అనుమానాస్పద మృతి
✓భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో మందుల కొరత
✓బీసీ రిజర్వేషన్ పై బీజేపీ ద్వంద్వ వైఖరి: సీపీఎం
✓ఇల్లందు: చల్ల సముద్రంలో యూరియా కొరత
News August 10, 2025
MBNR: పరిశుభ్రమైన ఆహారం అందించకపోతే కఠిన చర్యలు: కలెక్టర్

విద్యార్థులకు మెనూ ప్రకారం రుచికరమైన, పరిశుభ్రమైన ఆహారాన్ని అందించాలని కలెక్టర్ విజయేందిర బోయి సిబ్బందిని ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని తిరుమలగిరిలో ఉన్న గిరిజన సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలను ఆదివారం రాత్రి ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు వడ్డించే భోజనంలో మెనూ పాటించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వసతి గృహంలో సమస్యలు ఉన్నాయా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.
News August 10, 2025
సిద్దిపేటలో ఆకస్మికంగా తనిఖీలు

సిద్దిపేట కమిషనరేట్ పరిధిలో సాయంత్రం 4 గంటల నుంచి 7 గంటల వరకు పోలీసులు ఆకస్మికంగా వాహన తనిఖీలు నిర్వహించారు. రోడ్డు ప్రమాదాల నివారణ, అక్రమ రవాణాను అరికట్టడానికి వాహన తనిఖీ చేపట్టినట్లు సీపీ డాక్టర్ అనురాధ తెలిపారు. జిల్లావ్యాప్తంగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు కింద 76, ఎంవీ యాక్ట్ కింద 425 కేసులు నమోదైనట్లు తెలిపారు.