News August 7, 2025

మళ్లీ పెరిగిన గోల్డ్ & సిల్వర్ రేట్స్!

image

బంగారం ధరలు క్రమంగా పెరుగుతూ కొనుగోలుదారులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. వరుసగా నాలుగో రోజూ పెరిగి షాకిచ్చాయి. హైదరాబాద్‌లో ఇవాళ 24 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర ₹220 పెరిగి ₹1,02,550కు చేరింది. ఇక 22 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాముల ధర ₹200 పెరిగి ₹94,000 పలుకుతోంది. అటు కేజీ వెండిపై రూ.1,000 పెరిగి రూ.1,27,000గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.

Similar News

News August 10, 2025

ఇప్పటి పరిస్థితులపై.. వందేళ్ల క్రితం కార్టూన్

image

USకు చెందిన కార్టూనిస్ట్ బాబ్ మైనర్ వెస్ట్రన్ కంట్రీస్‌పై వేసిన ఓ కార్టూన్ వైరలవుతోంది. ‘డబ్బు, తుపాకులతో అమెరికా, ఫ్రెంచ్, బ్రిటీషర్లు ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ఎప్పటికైనా ప్రజలు ఎక్కువగా ఉన్న చైనా, భారత్, ఆఫ్రికా దేశాలు తిరిగి నిలబడతాయి, లెక్క సరిపోతుంది’ అని 1925లోనే కార్టూన్ వేశారు. సరిగ్గా ఇప్పుడు అలాంటి పరిస్థితులే ఉన్నాయని ఆ కార్టూన్‌ను షేర్ చేస్తూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

News August 10, 2025

సిరాజ్‌పై కోహ్లీ ఫ్యాన్స్ ప్రశంసల వర్షం

image

సిరాజ్‌ను కోహ్లీ ఫ్యాన్స్ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. విరాట్‌పై అతనికున్న అభిమానమే అందుకు కారణం. ఇటీవల సిరాజ్ మేనేజర్ ‘BELIEVE’ అంటూ కొన్ని ఫొటోలు షేర్ చేశారు. అందులో గోడకు కోహ్లీ ఆఖరి టెస్ట్ మ్యాచ్ జెర్సీ ఫ్రేమ్ కట్టించి ఉంది. అది చూసిన విరాట్ ఫ్యాన్స్ ఎమోషనల్ అవుతున్నారు. సిరాజ్-కోహ్లీ బాండింగ్‌కు ఇంతకన్నా గొప్ప నిదర్శనం ఏం కావాలి అంటూ నెట్టింట కామెంట్స్ చేస్తున్నారు.

News August 10, 2025

చిన్న పిల్లల పేరెంట్స్.. ఈ చిన్నపని చేయండి

image

మట్టిలో ఆడటం, శుభ్రత పాటించకపోవడం వల్ల పిల్లల శరీరంలో నులి పురుగులు ఏర్పడతాయి. 1-19 ఏళ్ల వరకు పిల్లల్లో నులి పురుగుల నివారణకు మందులు వాడుతూ ఉండాలి. వీటివల్ల ఆకలి తగ్గడం, రక్తహీనత, కడుపులో నొప్పి, పోషకాహార లోపం, ఎదుగుదల తగ్గడం వంటి సమస్యలు ఎదురవుతాయి. ప్రభుత్వం ఏటా ఫిబ్రవరి 10, ఆగస్టు10న రెండుసార్లు ‘నులి పురుగుల నివారణ దినోత్సవాలు’ నిర్వహిస్తుంది. ఈ సందర్భాల్లో ఉచితంగానే మందులు పంపిణీ చేస్తోంది.