News August 7, 2025

రేషన్ లబ్ధిదారులకు నిరాశ

image

AP: రేషన్ షాపుల్లో కందిపప్పు ఈ నెల కూడా పంపిణీ చేయకపోవడంతో లబ్ధిదారులు నిరాశ చెందుతున్నారు. కొంతకాలంగా సరఫరా నిలిచిపోగా, పండుగల సీజన్ కావడంతో ఈసారి ఇస్తారని అంతా భావించారు. షాపులకు వెళ్లాక అసలు విషయం తెలిసి అసంతృప్తి చెందుతున్నారు. కొన్నిచోట్ల అరకొరగా పంపిణీ జరుగుతున్నట్లు తెలుస్తోంది. మార్కెట్‌లో KG ₹120 ఉండటంతో రేషన్ షాపుల్లో పంపిణీ చేయాలని కోరుతున్నారు. మీకు కందిపప్పు అందిందా? కామెంట్ చేయండి.

Similar News

News August 11, 2025

శుభ సమయం (11-08-2025) సోమవారం

image

✒ తిథి: బహుళ విదియ మ.11.42 వరకు
✒ నక్షత్రం: శతభిషం మ.2.58 వరకు
✒ శుభ సమయం: ఉ.6.40-7.16, రా.7.52-8.16
✒ రాహుకాలం: ఉ.7.30-ఉ.9.00
✒ యమగండం: మ.10.30-మ.12.00
✒ దుర్ముహూర్తం: మ.12.24-1.12, మ.2.46-3.34
✒ వర్జ్యం: రా.9.13-రా.10.46
✒ అమృత ఘడియలు: ఉ.7.56-ఉ.9.29

News August 11, 2025

నేటి ముఖ్యాంశాలు

image

* బెంగళూరులో 3 వందేభారత్ రైళ్లు ప్రారంభించిన మోదీ
* TG: హైదరాబాద్ బస్తీల్లో పర్యటించిన సీఎం రేవంత్
* అన్ని ప్రభుత్వ భవనాలపై సోలార్ ప్లాంట్లు: భట్టి
* తుమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్టు కడతాం: ఉత్తమ్
* AP: డోలి రహిత గిరిజన గ్రామాలే లక్ష్యం: పవన్ కళ్యాణ్
* చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని పాతరేస్తున్నారు: జగన్
* రేపు పీఎం ఫసల్ బీమా యోజన నిధులు విడుదల

News August 11, 2025

భారత డ్యామ్‌ను మిస్సైళ్లతో పేల్చేస్తాం: పాక్ ఆర్మీ చీఫ్

image

US గడ్డపై నుంచి పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ భారత్‌కు హెచ్చరికలు చేశారు. ‘భవిష్యత్తులో తమ దేశానికి భారత్‌తో ముప్పు ఉందని తెలిస్తే సగం ప్రపంచాన్ని మాతో పాటు ధ్వంసం చేస్తాం. సింధూ నదిపై భారత్ డ్యామ్ కట్టే వరకు ఆగి 10 మిస్సైళ్లతో పేల్చేస్తాం. సింధూ నది భారతీయుల కుటుంబ ఆస్తి కాదు. మాదీ అణ్వాయుధ దేశమనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. మా వద్ద మిస్సైళ్లకు కొదవ లేదు’ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.