News August 7, 2025
వైసీపీ శ్రీకాకుళం జిల్లా యువజన విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ నియామకం

వైసీపీ శ్రీకాకుళం జిల్లా యువజన విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్‌గా పెందుర్తి మాజీ ఎమ్మెల్యే అన్నం రెడ్డి అదీప్‌ను నియమిస్తూ వైసీపీ కేంద్ర కార్యాలయం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈయన శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాలకు వర్కింగ్ ప్రెసిడెంట్‌గా విధులు నిర్వహిస్తారన్నారు. దీంతో ఆయనకు పలువురు శుభాకాంక్షలు తెలిపారు.
Similar News
News September 1, 2025
శ్రీకాకుళం: నేడు కలెక్టర్ గ్రీవెన్స్

శ్రీకాకుళం నగరంలోని జడ్పీ కార్యాలయంలో సోమవారం ఉదయం గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ చెప్పారు. ఈ మేరకు ఆయన ఆదివారం సాయంత్రం ఒక ప్రకటన విడుదల చేశారు. కార్యాలయానికి వచ్చి తమ ఫిర్యాదులు నేరుగా అందజేయవచ్చన్నారు. ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదికను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
News August 31, 2025
కలగా మిగిలిన వంశధార-బాహుదా నదుల అనుసంధానం

శ్రీకాకుళం జిల్లాలో వంశధార, బాహుదా నదుల అనుసంధానం కలగానే మిగిలింది. గొట్టాబ్యారేజీ నుంచి నీరు వృథాగా సముద్రంలోకి పోతోంది. వంశధార నది నుంచి సుమారు 97,262 టీఎంసీలు బాహుదాకు మళ్లించాలని గతంలో TDP ప్రభుత్వ హయాంలో సంకల్పించారు. ఈ రెండు నదులు అనుసంధానం చేస్తే ఎనిమిది మండలాల రైతులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. కూటమి ప్రభుత్వం స్పందించి వంశధార, బాహుదా నదుల అనుసంధానం వెంటనే చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
News August 31, 2025
శ్రీకాకుళం: రేపు కలెక్టర్ గ్రీవెన్స్